Showing posts with label fun. Show all posts
Showing posts with label fun. Show all posts

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్

Friday, January 31, 2014

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
బెంగళూరు : దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు.  అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్ కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్ మెంట్ లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు.

తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు.

ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.
Continue Reading | comments

అశ్లీల మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని బెదిరించినట్టు షెర్లీన్ కేసు

Thursday, January 30, 2014

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!
'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేశ్ పాల్ పై ఆరోపణలతో  శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు. కామసూత్ర 3డి చిత్రంలో నటించినందుకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని,  తనను లైంగిక వేధించడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ జప్తు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రూపేశ్ పై షెర్లీన్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
 
దర్శకుడితో విబేధాలు తలెత్తడంతో  'కామసూత్ర 3డి' చిత్రం నిర్మాతలతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటోంది. తన అశ్లీల చిత్రాల, వీడియోలను కామసూత్ర చిత్రంలో వినియోగించకుండా.. గ్లోబల్ కమర్షియల్ అశ్లీల (పోర్న్) మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని రూపేశ్ బెదిరించినట్టు షెర్లీన్ ఆరోపించారని పోలీసు అధికారి తెలిపారు. కామసూత్ర చిత్రంలో తన స్థానంలో మరొకరిని తీసుకుంటానని కూడా దర్శకుడు బ్లాక్ మెయిల్ చేశారని, గతంలో తనకు అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ తో రూపేశ్ విసిగించారని షెర్లీన్ ఫిర్యాదులో తెలిపారని  పోలీసులు వెల్లడించారు. 
 
అయితే షెర్లీన్ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని రూపేశ్ ఖండించారు. షెర్లీన్ ఆరోపణలకు భిన్నంగా రూపేశ్ తన కథనాన్ని మీడియాకు వివరించారు. తనను అప్పా, కెప్టెన్ అంటూ సంబోధించేవారని.. ఆమె కోసం గంటల కొద్ది అందరం షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసే వారం.  ఆమె తనను మానసికంగా చిత్రవధకు గురి చేసింది. షెర్లిన్ మాకు నరకం చూపించిందని రూపేశ్ ప్రతి ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన అశ్లీల వీడియోను షెర్లీన్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకుందని రూపేశ్ తెలిపారు. 
 
షెర్లీన్ ఫిర్యాదు ఆధారంగా రూపేశ్ పై ప్రాథమిక విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి రావాలని పలుమార్లు కోరినా షెర్లీన్ అందుబాటులోకి రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తాను బిజీగా ఉన్నందున పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని షెర్లీన్ తెలిపింది.
 http://www.sakshi.com/news/movies/sherlyn-chopra-files-a-case-on-kamasutra-3d-director-rupesh-paul-101437?pfrom=home-top-story
Continue Reading | comments

చోరీ సొత్తు అమ్మలేక

Wednesday, January 29, 2014

చోరీ సొత్తు అమ్మలేక లొంగిపోయారు
హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ ను పోలీసులు ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి నిందితుడు భూమన కిరణ్ కుమార్ ను ఇంతకుముందే లొంగిపోయాడు. వీరిద్దరూ పథకం ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.

మూడుసార్లు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పథకం నిర్వహించారని చెప్పారు. కిరణ్ ప్రణాళిక రచించగా ఆనంద్ అమలు చేశాడని వెల్లడించారు. స్కూ డ్రైవర్ పై చేతి రుమాలు పెట్టి సుత్తితో కొట్టి గోడ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. కిరణ్ బయట కాపలాగా ఉండగా ఆనంద్ దుకాణం లోపలకు వెళ్లి దొంగతనం చేశాడని చెప్పారు. మూడు బ్యాగుల్లో నగలు ఎత్తుకు పోయారని చెప్పారు. అయితే  సంఘటనా స్థలంలో ఆధారాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డారని వెల్లడించారు. ఐరీష్ కనబడకుండా కళ్లద్దాలు, తల వెంట్రుకలు ఘటనా స్థలంలో పడకుండా జెల్ రాసుకున్నారని చెప్పారు. పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా కారప్పొడి చల్లారని తెలిపారు.

చోరీ సొత్తు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భయపడిపోయి కిరణ్ కుమార్ లొంగిపోయాడని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లాడని పేర్కొన్నారు. వేరే వాళ్ల ప్రమేయం ప్రత్యక్షంగాని, పరోక్షంగాని కనబడలేదన్నారు.

sakshi
Continue Reading | comments

బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు

బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు
 అవాక్కయ్యారా!
 
 అది బీహార్‌లోని ఓ గ్రామం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా వివరాల సేకరణకు సీసీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇంకేముంది.. కేసు కొలిక్కి వచ్చేసినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఖాతాదారుడిని విచారిద్దామనుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అతనో బిచ్చగాడు. ఈ వ్యవహారాన్ని లోతుగా ఆరా తీస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథాకమామీషు ఏమిటంటే...    
 

 ‘‘+92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లాటరీ తగిలిందని చెప్పడంతో నమ్మి నగదు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి మోసపోయా’’... పోలీసులకు ఇటీవల వరుసగా వస్తున్న ఫిర్యాదులివి. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి సీసీఎస్ అధికారుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ల ద్వారా లాటరీ తగిలిందంటూ, తక్కువ ధరకే వస్తువులంటూ సౌతాఫ్రికా దేశాలు కేంద్రంగా ప్రజలను మోసగిస్తున్న నైజీరియన్లు.. ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్నారు. ఈ ఏజెంట్లు చేయాల్సిందల్లా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరవడమే.
 
 ‘గుర్తింపు’న్న భిక్షగాళ్లతోనే..
 ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఈ ఏజెంట్లు అక్కడి గ్రామాల్లో సంచరిస్తూ ఆధార్ వంటి ధ్రువీకరణలు కలిగిన భిక్షగాళ్లు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఒక రోజు కోసం ఆ గుర్తింపు పత్రాలతోపాటు వారి ఫొటోలు ఇస్తే రూ.2500 చెల్లిస్తామంటూ ఎర వేస్తున్నారు. ఇలా తీసుకున్న పత్రాలతో స్థానిక బ్యాంకుల్లో వారి పేర్లతోనే ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం గుర్తింపు పత్రాల్ని బిక్షగాళ్లు/పేదలకే ఇచ్చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డును మాత్రం సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. ఈ ఖాతాల ఆధారంతో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అనేకమందికి లాటరీలు, బహుమతుల పేరుతో ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎర వేస్తున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో తీసుకున్న ఇంటర్నేషనల్ రోమింగ్ కలిగిన సిమ్‌కార్డులు (+92 సిరీస్‌తో ఉంటాయి) ఉపయోగిస్తున్నారు.  
 
 ఎవరికీ చిక్కకుండా..
 నమ్మినవారికి భిక్షగాళ్ల బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇచ్చి అందులో నగదు వేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మోసపోయిన వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించినా... దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్ నుంచి సెల్ నెంబర్ల వివరాలు తెలుసుకోలేరు. ఖాతా ఆధారంగా దర్యాప్తు చేసినా... అది భిక్షగాళ్లు/పేదల వరకు వెళ్లి ఆగిపోతుంది. ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు సైబర్ నేరగాళ్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
 
 ‘+92’తో బహుపరాక్
 ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నగర ప్రజలకు సూచించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితుల్ని పట్టుకోవడం, రికవరీలు చేయడం అంతకష్టమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ‘+92’ సిరీస్‌తో వచ్చే ఫోన్లు/ఎస్సెమ్మెస్‌ల విషయంలో ప్రమత్తంగా ఉండాలని కోరారు.

 సాక్షి, సిటీబ్యూరో :
Continue Reading | comments

మూషికం కలుగులో కరెన్సీ నోట్లు...

Tuesday, January 28, 2014

మూషికం కలుగులో రూ.30 వేలు...
ఒక ఎలుక రూ.30 వేలు దా(దో)చి  ఔరా మూషికం అనిపించుకుంది. ఈ విచిత్రం నెల్లూరు జిల్లా తూపిలిపాళెంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగరాజుకి తన చిల్లర దుకాణంలో రోజూ నోట్ల లెక్క తప్పుతున్నా, ఏమయ్యాయో అర్థమయ్యేది కాదు. సోమవారం ఉదయం దుకాణం తెరవగానే ఎలుక చనిపోయిన దుర్వాసన వచ్చింది.
దీంతో వెతుకులాడగా చనిపోయిన ఎలుక, దాని కలుగు వద్ద కరెన్సీ నోట్లు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కలుగును తీయగా దాదాపు రూ.30వేలు దొరికాయి. ఇందులో రూ.5 వేల నోట్లు ఉపయోగం లేకుండా ముక్కలై ఉన్నాయి. దొరికిందే చాలనుకుని నాగరాజు సంబరపడ్డాడు. 
Continue Reading | comments

కిరణ్ కు రాజ్యాంగంపై ఉన్న పట్టు నాకు లేదు

Monday, January 27, 2014

తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు.

అదే సమయంలో కిరణ్ పై వ్యంగ్యాస్త్రం సందించారు.రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు.
తెలంగాణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని... బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు.
Continue Reading | comments

సంచలనం కోసమే తనిష్క్ లో చోరీ

జనంలో కన్పించాలన్న ఉద్దేశంతోనే తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ అనే యువకుడు తెలిపాడు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. ఐదు నిమిషాలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు.

రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపడానికే దొంగతనం చేసినట్టు కిరణ్ తెలిపాడు. దొంగతనానికి, రాజకీయానికి తేడా లేదన్నాడు. తాను ఒక రాత్రి దొంగ అయితే, రాజకీయ నాయకులు ఐదేళ్ల దొంగలని విమర్శించాడు. వ్యవస్థలో మార్పు రావాలని అతడు ఆకాంక్షించారు. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే తనను అవహేళన చేశారని చెప్పాడు. ప్రెసిడెంట్గా పోటీ చేసి ఊరిని బాగుచేయాలనుకున్నా అవకాశం ఇవ్వలేదన్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడం, సమాజంలో మంచితనం లేకపోవడం వల్లే దొంతనం చేశానన్నాడు. తన వెనుక ఎవరూ లేరన్నారు.

ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. చనిపోయే హక్కు తనకు లేదని విరమించుకున్నట్టు చెప్పాడు. ఏదోక సంచలనం చేసి జనం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో తనిష్క్లో చోరీ చేసినట్టు చెప్పాడు. జనం, రాజకీయం, సమాజంలో మార్పు రావాలని
ఆకాంక్షించాడు. తనకు అవకాశమిస్తే వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. ప్రజలను బాగు చేయగలన్న నమ్మకం తనకుందన్నాడు.

తనిష్క్ లో తానే చోరీ చేశానని కిరణ్ చెబితే పోలీసులు మొదట నమ్మలేదు. తన గదిలో దాచిన దొంగిలించిన సొమ్మును చూపించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు చెబుతున్న మాటల్లో వాస్తమెంత, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 http://www.sakshi.com/news/andhra-pradesh/guntur-young-man-tanishq-jewellery-looted-in-hyderabad-100771
Continue Reading | comments

Most Shocking Marriage In India

Friday, January 24, 2014

Continue Reading | comments

హుస్సేన్ సాగర్ లో దూకుతా- రాజకుమారి సవాల్

Thursday, January 23, 2014

టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఏకంగా హుస్సేన్ సాగర్ లో దూకుతానంటూ సవాల్ విసురుతున్నారు.సీమాంధ్రులు దోచుకున్నట్లు నిరూపిస్తే తాను హుస్సేన్‌సాగర్‌లోకి దూకి చస్తానని రాజకుమారి సవాల్ చేశారు. కలిసుండాలనడానికి తెలంగాణవాదులు పది కారణాలు చెబితే తాము వంద కారణాలు చెబుతామని ఆమె అన్నారు. తమను పొమ్మంటారని అనుకోలేదని, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు నమ్మామని వ్యాఖ్యానించారు. పొమ్మనగానే పోవడానికి తాము దద్దమ్మలం కాదని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు.

 http://kommineni.info/articles/dailyarticles/content_20140123_13.php
Continue Reading | comments

Lagadapati Rajgopal Fell down From Stage At APNGO's Chalo hyderabad Meet

Wednesday, January 22, 2014

Lagadapati Rajagopal
Continue Reading | comments

Autonagar Surya Movie Full Songs

Monday, January 20, 2014

Continue Reading | comments

Making of Mahaabali - Happy Birthday Anushka

Thursday, November 7, 2013


Continue Reading | comments

Making of Mahaabali - Happy Birthday Anushka


Continue Reading | comments

రుద్రమదేవి ఫస్ట్‌లుక్

Wednesday, November 6, 2013




రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్!
 ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం రుద్రమదేవి.  గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిస్తారికల్ స్టీచరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినీ చరిత్రలో కొత్త టెక్నాలజీతో రూపొందుతున్న తొలిచిత్రం.

అనుష్క పుట్టినరోజుని రోజు పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..గత ఏడాది అనుష్క పుట్టిన రోజున ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాం. అనుష్క నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. వచ్చే మార్చికి షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు.

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను నిత్యామీనన్, మరో పాత్రను కేథరిన్ చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, సమన్, జయప్రకాష్‌రెడ్డి, ప్రభ తదితరులు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.


Continue Reading | comments

భాగ్యనగరికి ఐటీ హారం

Sunday, September 22, 2013

భాగ్యనగరికి ఐటీ హారం
హైదరాబాద్ :  సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం/మాదాపూర్, న్యూస్‌లైన్: ‘భాగ్య’నగర కంఠసీమలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారనుంది. నగరంలో ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుంది. సిటీలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగం పుంజుకోనుంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం స్తబ్దుగా ఉన్న రియల్టీకి తాజా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇప్పటికే నగరంలో కొలువుదీరాయి. అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కొన్ని సంస్థలు ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టేందుకు వెనుకడుగేశాయి. రియల్‌ఎస్టేట్ కూడా మందగించింది. ఈ తరుణంలో తాజా ప్రకటన మళ్లీ నగరంలో రియల్ బూమ్ పెరిగేందుకు దోహదపడనుంది. 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాల) పరిధిలో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిధి పూర్తిగా నగరంలోనే ఉండటంతో నగరంలో పలు రియల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఐటీఐఆర్ ఏర్పాటు చేసేది ఇక్కడే..

ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మొత్తం 50 వేల ఎక రాల పరిధిలో మూడు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో 86.7 చదరపు కిలోమీటర్లలో ఒకటి, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో  79.2 చదరపు కిలోమీటర్ల మేర మరొకటి, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చదరపు కిలోమీటర్ల మేర మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు క్లస్లర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. వీటిని అనుసంధానిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి. పరిధిలో, ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను అనుమతిస్తారు. దీన్ని 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు.

‘మెట్రో’తో మరింత జోష్

 ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు మెట్రో రైల్ మరింత జోష్‌ను పెంచింది. ఐటీఐఆర్ ప్రతిపాదించిన మొదటి, మూడో క్లస్టర్లలో ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలుండడం అదనపు అంశం. దీంతో ఈ ప్రాంతాల్లో ఇప్పుటికే అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోంది. క్లస్టర్-1 పరిధిలో సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్‌లతో మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల వరకు అభివృద్ధి శరవేగంగా జరిగింది.

మియాపూర్‌లో 55 ఎకరాల్లో సుమారు రూ. 100 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద బస్ టర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇదే ప్రాంతంలో 104 ఎకరాల్లో మెట్రో రైల్వే డిపోను కూడా నిర్మించనున్నారు. దీనికి తోడు మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు  కంపెనీలు సంస్థల్ని ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

 మెట్రో కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు  28.87 కి.మీ. మెట్రో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టుకి ఈ మార్గంలో పనులు పూర్తిచేస్తామని ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. మెట్రో కారిడార్లలో మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్‌ను నిర్మిం చేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

 క్లస్టర్3 పరిధిలో విశేష అభివృద్ధి

 క్లస్టర్-3లోని ఉప్పల్, పోచారం ప్రాంతాలకు దగ్గర్లోని ప్రతిపాదిత నాగోల్-శిల్పారామం మెట్రోరైలు మార్గంలో ఉప్పల్, హబ్సిగూడల్లో స్టేషన్లు రానున్నాయి. మెట్రో రానుండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం కూడా జోరుగానే సాగుతుంది. హెచ్‌ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పోచారంలోని రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్, ఐటీ సెజ్ కంపెనీలతో ఈ ప్రాంతం హాట్‌కేక్‌లా మారింది. ‘ఎరేనా టౌన్‌సెంటర్’లో ఎన్‌ఎస్‌ఎల్ సంస్థ ఏకంగా 26 అంతస్తులతో పది టవర్లను నిర్మించింది. దీంతో బడా బడా నిర్మాణ సంస్థలు, దేశ, విదేశీ సంస్థలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నాయి.

రామంతాపూర్ వెళ్లే మార్గంలో 36 ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత సెజ్‌ను నూజివీడు సీడ్స్ ఏర్పాటు చేసింది. భాగ్యనగర్ మెటల్స్, ఐకానిక్, స్పేస్ డెవలపర్స్ సంస్థలు ఈ ప్రాంతంలో ఐటీ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నాయి. జోడిమెట్ల చౌరస్తా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో 23 ఎకరాల్లో చెన్నమనేని ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఆవలోన్ కోట్స్’ పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇదే ప్రాంతంలో సత్యవాణి కన్‌స్ట్రక్షన్స్, మోడీ బిల్డర్స్, సురానా కంపెనీ వంటి వివిధ సంస్థల భారీ నివాస సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు కూడా రానున్నాయి.

ఇప్పటికే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది. ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో విశేషంగా అభివృద్ధి జరగనుంది.

  మార్కెట్ అభివృద్ధి చెందుతుంది
 హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ గా మారుతుంది. మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ స్థాయి మల్టిప్లెక్స్‌లు, షా పింగ్‌మాళ్లు, భారీ నివాస సముదాయాలు వస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలిలను మించిన ఐటీ రంగ అభివృద్ధి ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు జరుగుతుంది. ఎక్కడిక్కడ శాటిలైట్ నగరాలు వెలుస్తాయి.
 -  జైవీర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్

 సద్వినియోగం చేసుకోవాలి
 ఐటీ రంగంలో హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ఐటీఐఆర్‌తో మొదటి స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్‌ఆర్, అనుకూలమైన వాతావరణం వంటి కారణంగానే ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌కు ఐటీఐఆర్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
  - శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు

 నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
 హైదరాబాద్‌కు ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్, గేమింగ్ అండ్ యానిమేషన్ సిటీ, రిలయన్స్ 100 అంతస్తుల సెజ్, హార్డ్ పార్క్ ప్రాజెక్టులు వస్తాయన్నారు. కానీ అవేమీ రాలే దు. వీటి పేర్లు చెప్పుకొని రియల్టర్లు బాగుపడ్డారే తప్ప ఉద్యోగాలేమీ రాలేదు. బోగస్ కంపెనీల మాయలో పడి ఐటీ ఉద్యోగులు మోసపోయారు. కనీసం ఇప్పుడైనా అలా జరగకుండా ఐటీఐఆర్‌ను పూర్తి చేయాలి.
 - నరేందర్, సీనియర్ సిస్టమ్స్ ఇంజినీర్

 వైఎస్ హయాంలోనే ప్రతిపాదనలు  
 హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చ డం అభినందనీయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు ఆమోదానికి నోచుకున్నాయి. కొత్త ప్రతిపాదనలతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సిటీలోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుండేది. - మధుమూర్తి రొనంకి,
 కో ఫౌండర్, అధ్యక్షులు, ట్యాలెంట్ స్ప్రింట్ సంస్థ

 మౌలిక వసతులు కల్పించాలి
 కొత్తగా ఐటీ రంగంలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండడంతో ప్రత్యకంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి వ స్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం ఉన్న మౌలికవసతులను మరింతగా మెరుగు పర్చాలి. ్రపస్తుతం ఉన్న జనాభా స్థాయిలో కొత్తగా నగరానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం శివారు ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్స్ నిర్మించాలి.  
 -  డి.శ్రీనివాస్‌కుమార్, ఐటీ ఉద్యోగి

 హైదరాబాద్‌కు మంచి గుర్తింపు
 కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు రావడం వల్ల సాంకేతికపరంగా హైదరాబాద్ మంచి గుర్తింపు పొందుతుంది. ఎంప్లాయ్‌మెంట్, గేమింగ్, ఐటీ రంగాల్లో రాబోయే తరాల వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వారి వల్ల మరింతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రా్రష్టంలోని ప్రస్తుత వాతావరణం ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలి.
 - కిరణ్-డిలాయిట్ ఐటీ ఉద్యోగి

http://www.sakshi.com/news/hyderabad/hyderabad-it-denominator-67323
Continue Reading | comments

Manam Movie First look Poster

Thursday, September 19, 2013

Continue Reading | comments

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!

Wednesday, September 18, 2013

తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కబళిస్తున్న హెచ్‌ఐవీ మహమ్మారి నిర్మూలనకు ఉపయోగపడే శక్తిమంతమైన అస్త్రాలు మరో రెండేళ్లలో సిద్ధం కానున్నాయి. అపార ఔషధగుణాలు గల ‘సమోవన్ మమాలా’ చెట్టు బెరడు, బ్రయోజోవా అనే సముద్రజీవుల నుంచి సేకరించిన రసాయనాలతో స్టాన్‌ఫర్డ్ వర్సిటీ  శాస్త్రవేత్తలు సమర్థమైన కొత్త మందులను తయారుచేశారు.

 సమోవన్ బెరడు నుంచి తయారుచేసిన ‘ప్రొస్ట్రాటిన్’ అనే ఔషధం.. మనిషి శరీర కణాల్లో దాక్కునే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ)ని బయటికి తరిమేస్తుందని వర్సిటీ శాస్త్రవేత్త పాల్ వెండర్ వెల్లడించారు. మంగళవారం ఇండియానాపొలిస్‌లో అమెరికన్ కెమికల్ సౌసైటీ 246వ సమావేశాల సందర్భంగా వెండర్ ఈ మేరకు ‘హెల్త్‌లైన్’తో మాట్లాడారు.

ప్రొస్ట్రాటిన్‌తో ఇప్పటిదాకా జంతువులు, ఎయిడ్స్ రోగుల రక్తంపై పరీక్షలు చేయగా, పూర్తి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మనుషుల్లో దీన్ని ఉపయోగించడం కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)’ అనుమతి కూడా లభించిందని, రెండేళ్లలోనే అందుబాటులోకి తేనున్నామన్నారు.

 కణాల లోపలి నుంచి గెంటేస్తుంది..!
 సమోవన్ బెరడు నుంచి ప్రొస్ట్రాటిన్, బ్రయోజోవన్ల నుంచి ‘బ్రయోస్టాటిన్’ రసాయనాలను సేకరించి వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. ఎయిడ్స్ చికిత్సకు ఇప్పటిదాకా తయారుచేసిన ఔషధాలు హెచ్‌ఐవీ వైరస్‌లు కణాల బయట ఉన్నప్పుడే వాటిని నాశనం చేయగలుగుతున్నాయి. ఈ ఔషధాల వినియోగం ఆపేయగానే కణాల్లో దాక్కున్న హెచ్‌ఐవీ వైరస్‌లు బయటికి వచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. అయితే కణాలలోపల దాగున్న వైరస్‌లను సైతం ప్రొస్ట్రాటిన్ బయటికి గెంటేయగలుగుతుందని వెండర్ వివరించారు.  

 పాతికేళ్ల క్రితమే గుర్తించినా...
 ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వంటి వైరస్‌లను నిర్మూలించే గుణం సమోవన్ చెట్టు బెరడుకు ఉందని 1987లోనే కాక్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీనిపై పరిశోధన చేపట్టిన పాల్ వెండర్ బృందం ఎట్టకేలకు ఔషధాన్ని తయారుచేయగలిగింది. అయితే ప్రకృతిసిద్ధమైన ప్రొస్ట్రాటిన్‌ను ప్రయోగశాలలో రకరకాల మార్పులకు గురిచేసిన తర్వాతే దానిని తాము వంద రెట్లు శక్తిమంతంగా మార్చగలిగామని వెండర్ పేర్కొన్నారు. బ్రయోజోవా నుంచి తీసిన బ్రయోస్టాటిన్‌ను కూడా వెయ్యిరెట్లు శక్తిమంతంగా తయారుచేశామని, హెచ్‌ఐవీని తరిమేయడంలో అది ప్రొస్ట్రాటిన్ కన్నా మేలైనదన్నారు.  

 కేన్సర్, అల్జీమర్స్ వ్యాధులకూ చికిత్స...
 మనిషి వేళ్ల మాదిరిగా ఉండే ‘బ్రయోజోవా’ నుంచి సేకరించిన బ్రయోస్టాటిన్ రసాయనం కేన్సర్, అల్జీమర్స్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడనుందని వెండర్ చెబుతున్నారు. బ్రయోస్టాటిన్‌తో కొన్ని జంతువులకు చికిత్స చేయగా.. అవి విషయాలను  ఎక్కువకాలం గుర్తుంచుకోగలిగాయట. దీంతో మతిమరుపు, ఇతర లక్షణాలుండే అల్జీమర్స్ చికిత్సకూ దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
 
 తేనెటీగ విషంతో హెచ్‌ఐవీ ఖతం!
 తేనెటీగ విషంలోని మెలిటిన్ పదార్థంతో హెచ్‌ఐవీ నిర్మూలనకు ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు ‘వాషింగ్టన్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. హెచ్‌ఐవీ సోకకుండా నివారించే జెల్‌తోపాటు మందును కూడా మెలిటిన్‌తో తయారుచేయవచ్చట.

 ఎక్కువ మొత్తంలో ఉంటే శరీర కణాలకు హాని చేసే మెలిటిన్‌ను అత్యంత సూక్ష్మ పరిమాణంలోని నానోపార్టికల్స్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడితే.. హెచ్‌ఐవీ కణాలకు అతుక్కుని వాటి చుట్టూ ఉండే రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తుందట. ఇంకేం.. రక్షణ కవచాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేక హెచ్‌ఐవీ  అంతమైపోతుందన్నమాట.

sakshi
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger