Showing posts with label movie news. Show all posts
Showing posts with label movie news. Show all posts

సినిమా రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌

Friday, January 31, 2014

రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
తారాగణం: నితిన్‌, అదా శర్మ, అజాజ్‌ ఖాన్‌, నికోల్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌
కథ, మాటలు, కథనం, నిర్మాత దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: జనవరి 31, 2014
- See more at: http://telugu.greatandhra.com/movies/reviews/review-heart-attack-50063.html#sthash.3DI4ZsWi.dpuf
Continue Reading | comments

అశ్లీల మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని బెదిరించినట్టు షెర్లీన్ కేసు

Thursday, January 30, 2014

కామసూత్ర 3డి దర్శకుడిపై షెర్లీన్ చోప్రా కేసు!
'కామసూత్ర 3డి' దర్శకుడు రూపేశ్ పాల్ పై ఆరోపణలతో  శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు. కామసూత్ర 3డి చిత్రంలో నటించినందుకు పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని,  తనను లైంగిక వేధించడమే కాకుండా.. తనకు ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ జప్తు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రూపేశ్ పై షెర్లీన్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
 
దర్శకుడితో విబేధాలు తలెత్తడంతో  'కామసూత్ర 3డి' చిత్రం నిర్మాతలతో గత కొద్దికాలంగా దూరంగా ఉంటోంది. తన అశ్లీల చిత్రాల, వీడియోలను కామసూత్ర చిత్రంలో వినియోగించకుండా.. గ్లోబల్ కమర్షియల్ అశ్లీల (పోర్న్) మార్కెట్ లో అమ్మకానికి పెడుతానని రూపేశ్ బెదిరించినట్టు షెర్లీన్ ఆరోపించారని పోలీసు అధికారి తెలిపారు. కామసూత్ర చిత్రంలో తన స్థానంలో మరొకరిని తీసుకుంటానని కూడా దర్శకుడు బ్లాక్ మెయిల్ చేశారని, గతంలో తనకు అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ తో రూపేశ్ విసిగించారని షెర్లీన్ ఫిర్యాదులో తెలిపారని  పోలీసులు వెల్లడించారు. 
 
అయితే షెర్లీన్ చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలని రూపేశ్ ఖండించారు. షెర్లీన్ ఆరోపణలకు భిన్నంగా రూపేశ్ తన కథనాన్ని మీడియాకు వివరించారు. తనను అప్పా, కెప్టెన్ అంటూ సంబోధించేవారని.. ఆమె కోసం గంటల కొద్ది అందరం షూటింగ్ స్పాట్ లో ఎదురు చూసే వారం.  ఆమె తనను మానసికంగా చిత్రవధకు గురి చేసింది. షెర్లిన్ మాకు నరకం చూపించిందని రూపేశ్ ప్రతి ఆరోపణలు చేశారు. తనకు సంబంధించిన అశ్లీల వీడియోను షెర్లీన్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకుందని రూపేశ్ తెలిపారు. 
 
షెర్లీన్ ఫిర్యాదు ఆధారంగా రూపేశ్ పై ప్రాథమిక విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి రావాలని పలుమార్లు కోరినా షెర్లీన్ అందుబాటులోకి రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. తాను బిజీగా ఉన్నందున పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని షెర్లీన్ తెలిపింది.
 http://www.sakshi.com/news/movies/sherlyn-chopra-files-a-case-on-kamasutra-3d-director-rupesh-paul-101437?pfrom=home-top-story
Continue Reading | comments

AHA KALYANAM AUDIO LAUNCH PHOTOS

Tuesday, January 28, 2014

















Continue Reading | comments

Heart attack Movie Latest Photos
















Continue Reading | comments

పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ బరిలో బాలీవుడ్ నటుడు

Monday, January 27, 2014

రాజ్యసభ ఎన్నికల బరిలో బాలీవుడ్ నటుడు!
పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ బరిలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి బరిలో దిగారు. ఫిబ్రవరి 7 తేదిన జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు మిథున్ తోపాటు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున మిథున్ చక్రవర్తి రాజ్యసభకు పోటీ చేయనున్నారు.
 
ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇక భవిష్యత్ లో కూడా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాను. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తృణమూల్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిథున్ అన్నారు. 
 
తృణమూల్ పార్టీ తరపున పెయింటర్ జోగెన్ చౌదరీ, బెంగాలీ దిన పత్రిక కలామ్ ఎడిటర్ ఆహ్మద్ హసన్, కేడీ సింగ్ లు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఐ పార్టీ తరపున స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ, కాంగ్రెస్ మద్దతుతో ఉర్దూ దిన పత్రిక ఆజాద్ హింద్ మాజీ ఎడిటర్ మలిహబడి పోటీలో ఉన్నారు.
Continue Reading | comments

ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతా!

Sunday, January 26, 2014

ఇంటి గుట్టు రట్టు చేస్తా!
డీఎంకె పార్టీలో అన్నదమ్ముల మధ్య మొదలయిన వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. పెద్దాయిన తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై తమిళనాట రాజుకున్న రాజకీయ రగడ వీధికెక్కింది. దీంతో రంగంలోకి దిగిన రాజకీ య కురువృద్ధుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద కొడుకు అళగిరిపై వేటు వేయడం ద్వారా డీఎంకె అధినేత ఎం కరుణానిధి తన చిన్న కుమారుడు స్టాలిన్ కు మార్గం సుగమం చేశారు. తన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా చిన్న కుమారుడే బాధ్యలు చేపడతాడన్న సంకేతాలిచ్చారు.

అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలని భావించి కరుణానిధి అదునుచూసి పెద్ద కుమారుడికి చెక్ పెట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘించారనే నెపంతో ఆళగిరిని పార్టీ నుంచి సాగనంపారు. ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఉద్వాసన పలికారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ ఎడబాటు తాత్కాలికమేనని మెలిక పెట్టారు.

ఆళగిరిపై వేటు వేయడం ద్వారా పార్టీ ముందు అందరూ సమానమే అని పెద్దాయన సంకేతాలిచ్చారు. అదే సమయంలో ఆళగిరికి పూర్తిగా తలుపులు మూసివేయకుండా జాగ్రత్త పడ్డారు. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ఆళగిరికి మళ్లీ పార్టీలోకి ద్వారాలు తెరుచుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచారు. ఆళగిరి సస్పెన్షన్ తో అటు స్టాలిన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకులపై చర్య తీసుకునేందుకు వెనుకాడబోనన్న సంకేతాలిచ్చారు. తద్వరా అన్నదమ్ముల ఆధిపత్య పోరుకు తాత్కాలికం బ్రేకు వేశారు.

అయితే తనను అవమానించిన తండ్రి, సోదరుడుపై ఆళగిరి కారాలు-మిరియాలు నూరుతున్నారు. స్టాలిన్ చేతిలో కరుణానిధి కీలుబొమ్మగా మారారని ఘాటుగా విమర్శించారు. స్టాలిన్ పదవీ కాంక్షాపరుడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ నెల 31న ప్రెస్‌మీట్ పెట్టి డీఎంకే లొసుగుల చిట్టా విప్పుతానన్నారని హెచ్చరించారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకే అధినేత సొంత సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.

sakshi
Continue Reading | comments

జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితిలో

ప్రముఖ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారంటూ మీడియాలో కధనాలు రావడం ఆశ్చర్యంగానే ఉంది. సికింద్రాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జయసుధ అక్కడ కాంగ్రెస్ లో వర్గ పోరును ఎదుర్కుంటున్నారు. ఒక దశలో రాజకీయాలకు గుడ్ బై చెబుదామని కూడ అనుకున్నారు.కాని కారణం ఏదైనా కాని టిఆర్ఎస్ నాయకత్వంతో ఆమె మంతనాలు జరుపుతున్నారట. రాయబారుల ద్వారా టిఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి నుంచి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారట.అక్కడ సీమాంద్రకు చెందివవారు ఎక్కువగా ఉంటున్నందున జయసుధను పార్టీలోకి తీసుకుంటే బాగానే ఉంటుందని కొందరు భావిస్తున్నారు.టిఆర్ఎస్ ఎమ్.పి విజయశాంతి ని కాంగ్రెస్ కు దగ్గరైన నేపద్యంలో జయసుధను తీసుకోవడం ద్వారా దెబ్బకు దెబ్బ తీస్తారన్నది సారాంశంగా ఉంది.ఇది నిజం అయ్యే అవకాశం ఉందా?రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.
Continue Reading | comments

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి కేకే

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి కేకే
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రాజ్యసభ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావును పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నేడు ప్రకటించారు. ఈ నెల 28న కేశవరావు నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండడంతో టీఆర్ఎస్ పోటీకి సిద్ధమయింది.

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కేశవరావుకు టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా అవకాశమిస్తే రెండు పార్టీల మధ్య వారధిగా పనిచేయడానికి వీలుంటుందనే వ్యూహంతో ముందడుగు వేసింది. సీఎం కిరణ్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి మద్దతు ఇస్తారన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉన్నట్టు కనబడుతోంది. అయితే అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మినహా తెలంగాణ నేతలు ఈ విషయంలో చేయగలిగేదేమీ ఉండదని అంటున్నారు.
Continue Reading | comments

వై.కాంగ్రెస్ కాకపోతే టిడిపి -పివిపి యత్నం



ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) ఇప్పుడు తెలుగుదేశం వైపు ఉందా?కొద్ది కాలం క్రితం వరకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన విజయవాడ నుంచి లోక్ సభ కు పోటీచేస్తారని ప్రచారం జరిగినా,ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వెనక్కి తగ్గారు. ప్రధానంగా ఆయన సూచించిన విధంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాని అప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం ఆ సీట్లకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసింది.దాంతో వారు ఆయన డిమాండ్ కు సుముఖత వ్యక్తపరచలేదు.దాంతో ఆయన విజయవాడ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన పోటీ చేయడానికి వెనక్కి తగ్గారు.ఆ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం సీనియర్ నేత ఒకరు పివిపిని తెలుగుదేశం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించారు 
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వర్గ రాజకీయాలలో భాగంగా కూడా ఈ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. విజయవాడ సీటుకు పివిపి అయితే బాగుంటుందని పార్టీ అదినేత చంద్రబాబు వద్దకు ఆ నాయకుడు రాయబారం చేశారు. అంతేకాక , పివిపిని చంద్రబాబు తో మాట్లాడే ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడారు కాని విజయవాడ సీటుకు హామీ ఇవ్వలేదు. వేరే సీటు ఏదైనా ఎంపిక చేసుకోవాలసి సూచించారని అంటున్నారు.విజయవాడ సీటును ఇప్పటికే ప్రముఖ రవాణ సంస్థ అధినేత కేశినేని నాని కి చంద్రబాబు హామీ ఇచ్చారు. వస్తున్నా మీకోసం యాత్ర సందర్భంగా కృష్ణ జిల్లలో అయిన కోట్ల రూపాయల ఖర్చు అంతా నాని భరించారని,అందువల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా ఉండజాలమని నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాక జిల్లా లోని మరోవర్గం నేతలు కూడా నానికే మద్దతు ఇచ్చారట.దీంతో ఈ వ్యవహారం పెండింగులో పడింది.ఒకప్పుడు నాదర్ గుల్ భూములను సబందించిన వివాదంతో ఒక పత్రిక యజమాని సూర్యప్రకాష్ రావు , పివిపి అక్రమంగా పొందారని అంటూ చంద్రబాబు ధర్నా చేశారు. ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికలలో సూర్యప్రకాష్ రావుకు అనకాపల్లి టిక్కెట్ ను చంద్రబాబు ఇచ్చారు.ఇప్పుడు ప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వడానికి కూడా టిడిపి పెద్దగా ఇబ్బందిపడడం లేదు. కాకపోతే విజయవాడ బదులు మరోసీటు ఎంపిక చేసుకోవాలని అన్నారట. రాజకీయాలు ఇలా ఉంటాయి.ఏ పార్టీ అయినా ఫర్వాలేదు టిక్కెట్ వస్తే ఫర్వాలేదని అభ్యర్ధులు, అభ్యర్ధి ఎవరైనా ఫర్వాలేదు..గెలిచే ఆర్ధిక స్థోమత ఉంటే చాలని రాజకీయ పార్టీలు భావించే రోజులివి.
Continue Reading | comments

పూరి థాట్ ప్రాసెస్‌ని మలుపు తిప్పిన ‘5’ అంశాలు

జీవితం ఓ యుద్ధం!
పూరి... చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ కంటెంట్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. పూరి... విజయాల కంటే పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న చెరువులాగా... నదిలాగే ఉండేవాడు. ఇప్పుడు తనో సముద్రం. ఆ కెరటాల గుండె చప్పుడుని డీకోడ్ చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. పూరి థాట్ ప్రాసెస్‌ని మలుపు తిప్పిన ‘5’ అంశాలు ఓసారి క్లోజప్‌లో...
 
 నా దృష్టిలో వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం!
 పుస్తకం: చందమామ
 చిన్నప్పుడు చందమామ బాగా చదివేవాణ్ణి. అందులో ఇష్టమైన కథలు చాలా ఉన్నాయి కానీ, ఐదవ తరగతిలో చదివిన ఒక కథ నన్ను బాగా ప్రభావితం చేసింది...
 ఓ పల్లెటూరు. అక్కడో వ్యక్తి. బుర్ర నిండా జ్ఞానాన్ని నింపుకోవాలన్నది అతని కల. అందుకే హిమాలయాల దారి పట్టాడు. ఒకటీ రెండూ కాదు... 40 ఏళ్లు అక్కడే ఉండి  బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఊళ్లోవాళ్లతో పంచుకోవాలనుకుని, సొంత ఊరికి బయలుదేరతాడు. ఊరి మొదట్లోనే అతనికి ఓ కసాయివాడు మేకను నరుకుతూ కనిపిస్తాడు. ఆ జ్ఞానికి మనసు ఊరుకోలేదు. ‘‘నాయనా.. జీవహింస మంచిది కాదు. నువ్వు వచ్చే జన్మలో మేకవై పుడతావు. అది మనిషై పుట్టి, నిన్నూ ఇలాగే హింస పెడుతుంది. అందుకే ఇలాంటి పనులు మానేసేయ్’’ అని హితబోధ చేస్తాడు. అప్పుడా కసాయివాడు ‘‘మీరు చెప్పిన లెక్క ప్రకారం గతజన్మలో వీడు నన్నిలాగే నరికేసుంటాడు. అందుకే రుణం తీర్చుకుంటున్నాను... ఇదో సైకిల్. డోన్ట్ వర్రీ’’ అని  చెప్తాడు. ఆ మాటలకు జ్ఞాని అవాక్కవుతాడు! ఓ మామూలు కసాయి వాడికున్న ఇంగితజ్ఞానం కూడా ఇంత సాధన చేసిన తనకు లేనందుకు సిగ్గుపడతాడు ఆ జ్ఞాని.  ఎందుకో ఈ కథ ఆ వయసులో నాకు బాగా ఆనింది! ఓ రకంగా చెప్పాలంటే... నా దృక్పథాన్ని మార్చింది! మనమెప్పుడూ మన పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం. వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం!
 
 ప్రశాంతంగా ఉన్న నా చెరువులో బండరాళ్లు వేసింది వీళ్లే!
 వ్యక్తి: ఒకరు కాదు ఐదుగురు!
 నా థాట్ ప్రాసెస్ మారడానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు రజనీష్, ఇంకొకరు రామ్‌గోపాల్‌వర్మ. వీళ్లిద్దరూ మంచి చెబుతారో, చెడు చెబుతారో నాకైతే తెలీదు కానీ... అవతలి వాళ్లని డిస్ట్రబ్ చేయగలరు. మనం డిస్ట్రబ్ అయితే కానీ, ఎప్పుడూ బుర్రపెట్టి ఆలోచించం. అదర్ యాంగిల్ నుంచి ఆలోచించడం ఎలానో వీరిద్దరి దగ్గరనుంచీ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇద్దరూ రెబల్సే. ప్రశాంతంగా ఉన్న నా చెరువులో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి డిస్ట్రబ్ చేసింది వీళ్లిద్దరే. అలా వీళ్లుగాక నన్ను డిస్ట్రబ్ చేసినవాళ్లు ఇంకో ముగ్గురు ఉన్నారు.   శ్రీశ్రీ- ఆయన పొయిట్రీ చదువుతుంటేనే మనమో అగ్నిపర్వతంలా మారిపోతాం. ముఖ్యంగా ‘మహాప్రస్థానం’. ఎన్నిసార్లు చదివినా అదే ఫీలింగ్!  
  చలంగారు- ‘మైదానం’ అయితే ఓ విప్లవమే!   ముప్పాళ్ల రంగనాయకమ్మగారు- ‘రామాయణ కల్పవృక్షం’ 40 ఏళ్ల క్రితమే చాలా డేరింగ్‌గా రాశారు. నాకు తెలిసి ఇండియాలో అంతటి రెబల్ లేడీ రైటర్ ఎవ్వరూ లేరు! వీళ్లందరి ప్రభావం నాపై చాలా ఉంది.
 
 ప్రేక్షకుణ్ణి అసహనానికి గురిచేయకూడదని తెలుసుకుంది ఆరోజే!
 సంఘటన: ‘బద్రి’ రిలీజ్ రోజు
నా తొలి సినిమా ‘బద్రి’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. సెకండాఫ్‌లో కొంత ఫుటేజ్ ఎక్కువ అనిపించింది. అయినా పర్లేదనుకుని ఎడిటింగ్ చేయకుండానే రిలీజ్ చేసేశాం. థియేటర్‌లో పబ్లిక్‌తో కూర్చుని చూస్తుంటే, నేను ఎక్కడైతే లెంగ్త్ ఎక్కువైందనుకున్నానో సరిగ్గా అక్కడే ప్రేక్షకులు గొల్లుమని  అసహనంతో అరిచారు. ఒకరిద్దరు సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లిపోయారు. నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. అప్పటివరకూ అంత మంచిగా సినిమా తీశాడు కదా అని ప్రేక్షకులు ఏమాత్రం ఎక్స్‌క్యూజ్ చేయరు. అసలే బయట లక్షాతొంభై టెన్షన్లతో వేగుతూ ఉండే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడమే ఎక్కువ. అలాంటి ప్రేక్షకుణ్ణి అసహనానికి గురి చేయకూడదన్నది ఆ రోజు తెలుసుకున్నాను! అందుకే నా సినిమాలెప్పుడూ ప్యాక్డ్‌గా ఉంటాయి. ఇంతటి చిన్న ఇన్సిడెంట్ కూడా వృత్తిపరంగా నాకంతటి గొప్ప పాఠం నేర్పింది!
 
 ఇక్కడ మంచితనమూ ఆయుధమే, దుర్మార్గమూ ఆయుధమే!
 కోట్: 'All is fair in war'
 యుద్ధంలో ఏదైనా సమంజసమే- అన్న ఈ కోట్‌ని నా హార్ట్‌లో, మైండ్‌లో పర్మినెంట్‌గా స్టోర్ చేసుకున్నా! జీవితంలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా! జీవితం ఓ యుద్ధం. దేవుడు మనల్ని వార్‌జోన్‌లో పడేశాడు. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నా దృష్టిలో...
 ఇతర జంతువులనుంచి రక్షించుకోవడానికి ఆయుధం పుట్టింది.
 ఎండా వానల నుంచి రక్షించుకోవడానికి ఇల్లు పుట్టింది.
 ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి వైద్యం పుట్టింది.
 మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి మానవత్వం పుట్టింది.
 నిస్సహాయత నుంచి దైవం పుట్టింది.
 
 ఇక్కడ మంచితనమూ ఆయుధమే. దుర్మార్గమూ ఆయుధమే! ఏదో ఒక పేరు చెప్పుకుని మనల్ని మనం కాపాడుకోవాలి... లేకపోతే మనల్ని చంపేస్తారు!
 
 నా హీరోల క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఆ నాయకుడే!
 సినిమా: నాయకుడు
 డిగ్రీలో ఉండగా అనకాపల్లిలో చూశాను ఈ  సినిమా. చూసింది రెండుసార్లే కానీ, ఇప్పటికీ ప్రతి సీనూ గుర్తుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ చేసిన వీరినాయుడు క్యారెక్టర్ నన్ను బాగా ప్రభావితం చేసింది.  ఇందులో వీరినాయుడు చేసేవన్నీ సంఘవ్యతిరేక కార్యకలాపాలే! చిత్రమేంటంటే అవన్నీ మనకు పాజిటివ్‌గా అనిపిస్తాయి. ‘పదిమందికి మేలు చేసే పని ఎప్పుడూ తప్పు కాదు’ అని వీరినాయుడు తండ్రి ఓ డైలాగ్ చెబుతాడు. దాంతో మనం కన్విన్స్ అయిపోయి, వీరినాయుడి పాత్రలో లీనమైపోతాం. స్ట్రగుల్స్, రకరకాల ఫేజ్‌లతో ఆ పాత్రకో స్ట్రాంగ్ మెంటాల్టీ ఏర్పడింది. అదే నన్ను ఇన్‌స్పయిర్ చేసింది. నా సినిమాల్లో హీరో క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఈ సినిమానే!
 
 - సంభాషణ: పులగం చిన్నారాయణ

sakshi
Continue Reading | comments

టీఆర్‌ఎస్ వైపు జయసుధ చూపు!

టీఆర్‌ఎస్ వైపు జయసుధ చూపు!
మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదన
 
  సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యుడి ద్వారా ఆమె టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఈ మేరకు వర్తమానం పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థివర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం, గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా పార్టీలో పెద్ద దిక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని జయసుధ భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం పంపినట్లు తెలిసింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం.
 
 మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో సెటిలర్లతో పాటు, మైనారిటీవర్గాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగాఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఉంటాయని జయసుధ వివరించినట్టు తెలిసింది. గత మూడు నాలుగు వారాలుగా ఈ ప్రతిపాదనపై మంతనాలు జరుగుతున్నా, చర్చలు ఒక కొలిక్కి రాలేదని తెలిసింది.
 
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్, జయసుధ ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. టీఆర్‌ఎస్ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. జయసుధను పార్టీలో చేర్చుకుంటే టీఆర్‌ఎస్‌కు చెందిన ఒక ఎంపీని చేర్చుకున్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేదన్న కారణంతో ఇక్కడ పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జయసుధ వంటి ప్రముఖ వ్యక్తి పార్టీలో చేరితే తెలంగాణవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది.

సాక్షి
Continue Reading | comments

Power raviteja firstlook Birthday special

Saturday, January 25, 2014



Continue Reading | comments

Anushka photos at Pedigree Blue Cross Pet Carnival 2014

Friday, January 24, 2014



























Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger