Showing posts with label slide. Show all posts
Showing posts with label slide. Show all posts

కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం తప్పదా!

Friday, January 31, 2014

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదా?ఎఐసిసి ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి(ని విలీనం చేయాల్సిందేనని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం విశేషం. తెలంగాణ బి్ల్లుపై శాసనసభ లో చర్చ పూర్తి అయ్యాక ఆయన ఈ విషయం చెప్పడం విశేషం.ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నూటికి నూరుశాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!

Thursday, January 30, 2014




కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. కాగా బిజెపి నేత వెంకయ్య నాయుడు ను రఘురామరాజు తన ఇంటికి ఆహ్వానించి, బిజెపిలో చేరే విషయమై చర్చించారని కదనాలు రావడంతో పార్టీ ఈ చర్య తీసుకుంది
Continue Reading | comments

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
న్యూఢిల్లీ : గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది.
Sakshi
Continue Reading | comments

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Continue Reading | comments

టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

Wednesday, January 29, 2014

అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి  అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని,ఓడిపోతామనే భయంతో ఓటింగ్ కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు.

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ను వెంటనే పెట్టాలని మంత్రి టిజి వెంకటేష్ కోరారు. ఓటింగ్ ముగిశాక శాసనసభలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. అందువల్ల శాసనసభ్యులకు బద్రత కల్పించాలని కూడా ఆయన సలహా ఇస్తున్నారు.అలాంటప్పుడు ఇక్కడ ఓటింగ్ పెట్టి విధ్వంసానికి అవకాశం ఇవ్వడం ఎందుకో?టిజి వెంకటేష్ గారు భయపడే విదంగా పరిస్థితి రాకూడదు సుమా
Continue Reading | comments

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?

Tuesday, January 28, 2014

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ తీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యమాలను పట్టించుకోకుండానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టడానికి దేశ రాజధానిలో చకచకా పావులు కదుపుతోంది. ఫిబ్రవరి తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 
పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 తేదిన తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి జైరాం రమేశ్  ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
sakshi
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు అని సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది.
Continue Reading | comments

స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడట

'స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడట'
చెన్నై : ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తన పెద్ద కొడుకు ఎంకే అళగిరిపై కరుణానిధి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడని అళగిరి తనకు చెప్పినట్లు కరుణ వెల్లడించారు. 'స్టాలిన్ అంటే అళగిరికి ఎందుకోగానీ అస్సలు పడదు. స్టాలిన్ మూడు నెలల్లో చచ్చిపోతాడని కూడా అన్నాడు. కన్న కొడుకు గురించి ఇలాంటి మాటలను ఏ తండ్రీ సహించలేడు. కానీ పార్టీ అధినేతగా నేను సహించాల్సి వచ్చింది' అని కరుణానిధి విలేకరుల సమావేశంలో అన్నారు.

జనవరి 24వ తేదీ ఉదయం అళగిరి తన ఇంటికి వచ్చి, స్టాలిన్ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడని కరుణ చెప్పారు. పార్టీ అధినే ఇంటికి తెల్లవారుజామున 6, 7 గంటల సమయంలో రావడం సరైనదేనా అన్నారు. మదురైలో పార్టీకి వ్యతిరేకంగా అళగిరి ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. డీఎండీకేతో పొత్తు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఫలితాలు సరిగా రాలేదన్నారు. చాలా కాలంగా పార్టీ కోశాధికారి స్టాలిన్ గురించి అళగిరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కరుణానిధి మండిపడ్డారు. క్షమాపణ చెబితే అళగిరిపై సస్పెన్షన్ ఎత్తేస్తారా అని అడగ్గా, ఆ విషయం అతడినే అడగాలని చెప్పారు.

http://www.sakshi.com/news/top-news/alagiri-said-stalin-would-die-in-three-months-karunanidhi-101110
Continue Reading | comments

వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ, సంస్థాగత ఎన్నికలు




హైదరాబాద్: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వచ్చే నెల 2న వైఎస్ ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించనున్నారు. ప్లీనరీకి ముందే సంస్థాగత ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఫిబ్రవరి 1న వైఎస్ ఆర్ సీపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు సీజీసీ భేటీ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి 5 గంటలకు ఆమోదిత నామినేషన్లను ప్రకటిస్తారు. ఆ మరుసటి అంటే ఫిబ్రవరి 2న ఉదయం 8:30 నుంచి 11:30 వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి 12:30కు గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ప్లీనరీకి దాదాపు 9వేల మందిని ఆహ్వానించినట్టు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల లోపే హాజరుకావాలని సూచించారు
ఇప్పటి వరకు వైసిపి ఒకే ఒక్కసారి ప్లీనరీ నిర్వహించింది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విభజన తీర్మానం, సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి వంటి అంశాలపై ప్లీనరీలో సుదీర్ఘంగా చర్చించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో క్యాడర్ కు నాయకత్వం వహించే బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలి అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లీనరీలోనే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు కసరత్తులు చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ఇవ్వాల్సిన స్థానాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలు జగన్ తీసుకోనున్నారు. మొత్తానికి అన్ని రకాల సన్నాహాలకు వైసీపీ సిద్ధమవుతోంది.
Continue Reading | comments

పూనమ్ పాండే వెబ్ సైట్ హ్యాక్..

పూనమ్ పాండే వెబ్ సైట్  హ్యాక్.. పాకిస్థానీ పాత్ర
ముంబై: హాట్ హాట్ ఫోజులు, సంచలన వ్యాఖ్యలు, ట్వీట్లతో ఎలాగోలా వార్తల్లో నిలిచే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడల్ పూనమ్ పాండేకు ఈసారి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పూనమ్ వెబ్ సైట్ ‘www.poonampandey.in’ ను ఆదివారం పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో అవాక్కయిన పూనమ్ ముంబై సైబర్ క్రైం సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్ సైట్ ను హ్యాక్ చేశారని తెలియగానే షాక్ కు గురయ్యానని ఈ మోడల్ భామ చెప్పింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పుకొచ్చింది. హ్యాక్ చేసిన వ్యక్తి పాకిస్థాన్, కాశ్మీర్ సంబంధిత విషయాల్ని పూనమ్ సైట్ లో రాశాడు. ఈ విషయాల్ని పూనమ్ ట్వీట్ చేసింది. షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే వెబ్ సైట్ తన నియంత్రణలోకి వస్తుందని పేర్కొంది. కొత్త లుక్, మరింత మసాల వార్తలతో ముందుకొస్తానంటూ ముక్తాయించింది.
Continue Reading | comments

AHA KALYANAM AUDIO LAUNCH PHOTOS

















Continue Reading | comments

ఆఖరికి ఆ బాటలోకే!

ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో మొదట తీర్మానం చేసి, ఆ తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ ఆదినుంచీ వ్యతిరేకి ంచాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసివచ్చింది!

 ‘విభజించు-పాలించు రాజకీయాల వల్ల ఉపఖండం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. కలసి పని చేయలేకపోతే ఏదీ సాధించలేం. చర్చలూ, అంగీకారంతోనే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యం లక్షణం’
 - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

 ‘రిపబ్లిక్ డే’ (జనవరి 26, 2014) సందేశం
 ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ పేరుతో తెలుగుజాతిని చీల్చడానికి యూపీఏ నేడు ఆడుతున్న నాటకం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గణతంత్ర దినోత్సవంలో ఇచ్చిన సందేశంతో బట్ట బయలయిందని భావించాలి! అసలు రాష్ట్ర విభజన ‘బిల్లు’ అనేది ఉద్దేశిత ‘బిల్లా’ లేక ‘ముసాయిదా బిల్లా’ అన్నది శాసన సభలో తలెత్తిన తాజా వివాదం! కేంద్రంలో ఒకడు ఇది ‘ముసాయిదా’నే అంటాడు, మరొకడు ‘ఏబ్బే! అసలు బిల్లే’’ అంటాడు! ఈ మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులకి ‘ఇది బిల్లు కాదు, ముసాయిదా బిల్లు మాత్రమే’నన్న జ్ఞానోదయం కలిగింది.

 ఆలస్యంగా జ్ఞానోదయం
 విభజన బిల్లు అస్తవ్యస్తంగా ఉండటమే గాక, విభజనతో తలెత్తే సమస్యలకూ, ఆర్థిక వనరుల విభజనకూ సంబంధించిన ఏ ఒక్క అంశానికీ వివరణలూ, పరిష్కారాలూ చూపనందున తిప్పి పంపాలని ముఖ్యమంత్రి శాసన సభాపతికి లేఖ పంపి సంచలనం సృష్టించారు. కానీ ఈ పనిని ఆయన 40 రోజుల క్రితమే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ‘ముసాయిదా’గా కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ద్వారా పంపిన ఈ నిరర్థక బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలించకుండానే రాష్ట్రా నికి చేరడం పెద్ద విశేషం! విభజనను ముఖ్యమంత్రి నిజంగానే అడ్డుకొనదలచి ఉంటే ఇన్ని రోజులు కాలక్షేపం చేయకుండా ‘ముసాయిదా’కు సంబంధించి కేంద్రం చేసిన ఈ తీవ్ర తప్పిదాన్ని రాష్ట్రప్రజల దృష్టికీ, ఓ వ్యక్తిని ప్రధానిగా ప్రమోట్ చేయడం కోసం తెలుగు జాతిని విభజన హింసకు గురి చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికీ తెచ్చి ఉండాల్సింది.

 అసలు మోసం ఏదంటే -1950లో రాజ్యాంగం అవతరించినది లగాయతూ ఈ రోజు దాకా, ఎన్నడూ కీలకమైన ఒక బిల్లును చర్చ పేరిట ముసాయిదా రూపంలో ఏ రాష్ట్ర శాసనసభకూ పంపిన ఉదాహరణ లేదు. ఇది విభజనకు తొలి ఘట్టం. అయితే అదే లోక్‌సభ, రాజ్యసభల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉండటం మరో విశేషం. ఈ పరిస్థితీ, ఈ దుస్థితీ ఎందుకొచ్చాయి? వచ్చినది ఒరిజినల్ (అసలు) బిల్లు అయి ఉంటే దానిలో రాష్ట్ర విభజనను ఏ కారణాలపైన, ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో తలపెట్టారో సుస్పష్టమైన ప్రకటన ఉండాలి. ఏ బిల్లుైనైనా (అసలు ‘బిల్లే’ అయితే) పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లును అధికారికమైన ‘గెజిట్‌‘లో ప్రకటించాలని స్పీకర్ ఆదేశిస్తాడు. కానీ రాష్ట్ర విభజన కోసం వచ్చిన బిల్లు ‘ముసాయిదా’ (హోంశాఖ ప్రకటన ప్రకారం) మాత్రమే కాబట్టి, అదీ రాజ్యాడగ విరుద్ధంగా సవాలక్ష ‘లొట్ట’లతో మన శాసనసభకు వచ్చిన కాపీ కావడం వల్ల అది అసలు బిల్లు కాదని తేలిపోయింది!

 అంతేగాదు, ఈ బిల్లు లక్ష్య నిర్వచనం లేని పత్రం కావడం వల్ల, దానితో పాటు జత చేసి పంపించవల సిన శాసనాధికారాల బదలాయింపు, ద్రవ్య వ్యవహారాల మెమోరాండాలు కూడా లేవు! అందువల్ల ఈ ప్రత్యేక సంభారాలన్నింటినీ సమకూర్చుకున్న రూపంలో వచ్చిందే అసలు బిల్లు అవుతుంది. ముందు ‘ముసాయిదా’ అనీ, ఆ తరువాత తమకు తోచినట్టు ఏవేవో నిబంధనలూ, క్లాజులూ పరోక్షంగా చొప్పిం చవచ్చునని భావించి కేంద్రం పంపిన బిల్లు అసలు బిల్లు కాలేదు. ఇలాంటి ప్రయోగానికి తెలుగు జాతిని బలి చేయడం తగదని పాలకులు గ్రహించాలి.

 ముందే చెప్పిన వైఎస్సార్ సీపీ
 ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాల కన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొదట శాసనసభ తీర్మానం చేసిన తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను ముందు నుంచీ కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేకించాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసి వచ్చింది! ఇది బలాబలాలు చూసుకునే సమయం గానీ, ఎవరు ఎవరిని ‘సాధిం చా’లో లెక్కించుకునే వేళ కూడా కాదని దారితప్పిన రాజకీయ నాయకులూ, వారి పక్షాలూ గ్రహించాలి.

  పార్లమెంటులో ఈ అసమగ్ర బిల్లును ఆదరాబాదరా ప్రవేశపెట్టేసి చేతులు దులిపేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అది అంత తేలిక కాదు. రాజ్యాంగ ‘అధికరణ-3’ ప్రకారం నల్లేరు మీద బండిలాగా ‘విభజన’ ప్రక్రియను డొల్లించుకువెళ్లడం సాధ్యం కాదు. ఈ విష యాన్ని సుప్రీంకోర్టు (ఉత్తరాంచల్ వర్సెస్ శ్రీవాత్సవ కేసు-2003) ఒక తీర్పులో స్పష్టం చేసింది.  పార్లమెంటు అధికారం భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి మాత్రమే ఉండాలని సమున్నత న్యాయస్థానం చెప్పింది. చేసిన చట్టం రాజ్యాంగ పరిమితుల్ని అధిగమించి పోయినప్పుడు ఆ చట్టం సామంజ స్యాన్ని కోర్టులు ప్రశ్నించవచ్చని కూడా సుప్రీం చెప్పింది.

 పార్లమెంటు అధికారానికి సుప్రీంకోర్టు ఇన్ని పరిమితులు విధిస్తున్నా కేంద్ర ప్రభు త్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే కనీసం నెల రోజులు ముందుగానే నోటీసు ఇవ్వాలన్న నిబంధననూ ఉల్లంఘించిన సన్నివేశాలున్నాయి. ఆమాటకొస్తే, రాష్ట్రం సరిహద్దుల్నిగానీ, లేదా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంలో కలపవలసి వచ్చినప్పుడుగానీ లేదా భూభాగంలో ఏదైనా ముక్కను వేరు చేయాలనుకున్నాగానీ ఆ రాష్ర్ట శాసనసభ సంపూర్ణ ఆమోదాన్ని పొంది తీరాలన్న హక్కును, అధికారాన్ని 370 అధికరణతో ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించారు. మిగతా రాష్ట్రాల శాసన వేదికలకు ఆ హక్కూ, అధికారం లేకుండా చేశారు! కేంద్ర పాలక రాజకీయ పక్షాల రాజ్యాంగ ఉల్లంఘన జమ్మూ కాశ్మీర్‌తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎన్నో ఉల్లంఘనలు. పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర, రాష్ట్రాల పరిధిలోనూ, ఉమ్మడిగానూ రాజ్యాంగం విభజించిన అంశాల జాబితాలోని రాష్ట్రాల పరిధిని ‘249-అధికరణ’ చాటున కేంద్రం ఉల్లంఘిస్తూనే ఉంది!

 రాష్ట్రపతిని కూడా మోసగించగలరు
 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సాధికార సిఫారసులపైన ఏర్పడిన తొలి భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కూడా కృత్రిమంగా విభజించాలని కేంద్రం చూస్తున్నది. అలాగే 356-357 అధికరణల చాటున, కాంగ్రెస్ అధికారానికి అక్కడ మూడినప్పుడల్లా ‘రాష్ట్ర పాలన స్తంభించిపోయింది లేదా శాంతి భద్రతలు కొరవడ్డాయ’న్న మిషపైన రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. చివరికి ఈ ఉల్లంఘనకు (బొమ్మైకేసులో) 1994లో సుప్రీంకోర్టు ‘పిడి’ పడేదాకా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అందుకే కేంద్ర-రాష్ర్ట సంబంధాల పనితీరును సమీక్షించిన సర్కారియా కమిషన్ కూడా కాంగ్రెస్‌కు చెంపపెట్టు పెట్టవలసి వచ్చింది!

  చివరికి సుప్రీంకోర్టు అధికారాలను కుదించి కించపరచడానికి ఉద్దేశించిన 39-42వ అధికరణల ప్రవేశానికి కారకులు ఈ కాంగ్రెస్ పాలక శక్తులేననీ, వాటికి ‘ముగుదాడు’ వేసి నిర్వీర్యం చేసిన ఘనత సుప్రీంకోర్టుదేననీ మరచిపోరాదు! సప్త స్వాతంత్య్రాలను బంధించిన వ్యవస్థలో పత్రికా రంగం సహా అన్ని సంస్థలూ ఆనాడు ఎలా పతనమయ్యాయో మన ప్రత్యక్షానుభవం! చదవేస్తే ఉన్న మతి కూడా పోయిందన్నట్టుగా, 200 ఏళ్లలో అమెరికా రాజ్యాంగానికి 30 సవరణలు మాత్రమే రాగా, 1950లో భారత రాజ్యాంగం వచ్చింది మొదలు ఈ క్షణం దాకా 395 అధికరణలూ, 12 షెడ్యూళ్లు, 100కు మించిన సవరణలతో 64 ఏళ్లు గడిపేశాం. ప్రపంచంలో ఇంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన రాజ్యాంగం ప్రపంచంలో లేదు. అయినా రాజ్యాంగం పొడవైన కొద్దీ, పాలకుల బుద్ధి కురచైపోతోంది! ఇది, రాష్ట్రపతిని కూడా మోసగించగల రాజ్యవ్యవస్థ!  

sakshi
Continue Reading | comments

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా జెసి!

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా జెసిజెసి దివాకర రెడ్డి
 రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి  నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి సదారంకు  ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేయనున్నారు. కాంగ్రెస్ తరఫున ముగ్గురినీ ప్రస్తుత రాజ్యసభ సభ్యులనే ఎంపిక చేశారు. కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ పేర్లును అధిష్టానం ఖరారు చేసింది.

అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు జెసి మూడు రోజుల క్రితమే ప్రకటించారు.  తనకు సహకరించాలని మంత్రులు  గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటష్ లతో పాటు పలువురు ఇతర నేతలను కోరారు.  అధిష్టానాన్ని ధిక్కరించి జెసి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు  పోటీ చేసే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

sakshi
Continue Reading | comments

డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!

Monday, January 27, 2014

'డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!
తెలుగు దేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికలు ఆపార్టీ నేతల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని నింపాయి. రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ, సోమిరెడ్డి, మోత్కుపల్లిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకొచ్చారు. ఓ దశలో డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా అని  చంద్రబాబుపై మోత్కుపల్లి విరుచుకుపడినట్టు సమాచారం. 
 
గతంలో కూడా ఇలాగే చేశారని బాబుపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  ఎన్ని కష్టాలెదురైనా పార్టీలోనే ఉన్నాం అయినా గుర్తించారా? అంటూ మోత్కుపల్లి నిలదీశారు. తన ఆగ్రహాన్ని మీడియాతో పంచుకునేందుకు సమావేశం హాలునుంచి బయటకొచ్చేసిన మోత్కుపల్లిని సీనియర్ నేతలు  నామా నాగేశ్వర్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు సముదాయించి లోనికితీసుకెళ్లారు.  పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభైన కాసేపటికే హరికృష్ణ, సోమిరెడ్డిలు బయటకు వచ్చారు.
Continue Reading | comments

ఎన్‌టి‌ఆర్ పాత పత్రికా ఫోటోలతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై వై యస్ ఆర్ అభిమానుల ప్రచారం












 





































source: facebook

Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger