Showing posts with label featured. Show all posts
Showing posts with label featured. Show all posts

గాంధీ 'హేరాం' అనలేదు

Thursday, January 30, 2014

గాంధీ 'హేరాం' అనలేదు
 తలవని తలంపుగా 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగిన గాంధీ హత్యకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను ఆయన ‘సాక్షితో పంచుకున్నారు. నేటికీ కల్యాణం తానుండే వీధులను ఆయన తెల్లవారుజామున లేచి శుభ్రం చేసుకుంటూ గాంధేయవాదాన్ని చాటుతున్నారు. 90 ఏళ్ల కల్యాణం కేజ్రీవాల్ గాంధీపైన రెండు ప్రత్యేకమైన వెబ్‌సైట్లను రూపొందించి నెటిజన్లకూ గాంధేయవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే...
 
1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది.  కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.

కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారుు. అక్కడే కుప్ప కూలిన గాంధీమహాత్ముని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లించే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ ఆయనను బిర్లా హౌస్‌లోకే తరలించారు.  
 
పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీ హత్యకు 48 గంటల ముందు ఆయన అభిమాని ఒకరు జాగ్రత్తగా ఉండాలని బాపూజీని కోరారు.
అప్పుడు ఆయన నవ్వుతూ ‘‘ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. ఆ ఉన్మాదిపై నాకు ఎటువంటి కోపమూ రాదు. పరమాత్మ నా హృదయంలోనూ, పెదాలపైనా నర్తిస్తున్నప్పుడు నేను చావుకు ఎందుకు భయపడాలి’’ అని అన్నారు.
 
గాంధీ హత్య గురించిన ఎన్నో విషయాలను వెల్లడించిన వి.కల్యాణం ప్రస్తుతం చెన్నై తేనాంపేటలో నివశిస్తున్నారు. 90 ఏళ్ల ముదిమి వయసులోనే ఆయన గాంధేయవాదాన్ని, గాంధీ సిద్ధాంతాలను తుచ తప్పక ఆచరిస్తు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి వెంకిట కల్యాణం అలియాస్ వి.కల్యాణం ఆగస్టు 15, 1922న జన్మించారు.  తమిళుడే అయినా పుట్టింది, పెరిగింది ఉత్తరభారతంలోనే.
24 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, 26వ ఏట గాంధీ సబర్మతీ ఆశ్రమంలో చేరారు కల్యాణం. గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసే మహదేవ్ దేశాయ్ మృతి చెందడంతో అనుకోకుండా గాంధీ 1944లో కల్యాణంను వ్యక్తిగత సెక్రటరీగా నియమించుకున్నారు. అయిదు భాషలు రాయడం, చదవడం వచ్చిన కల్యాణం అనతి కాలంలోనే గాంధీకి అత్యంత ఆప్తులయ్యారు.

sakshi
Continue Reading | comments

ఇంగ్లండ్ రాణికీ ఆర్థిక కష్టాలు..!

Tuesday, January 28, 2014

ఇంగ్లండ్ రాణికీ ఆర్థిక కష్టాలు..!
లండన్: ఇంగ్లండ్.. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం. గత వైభవానికి గౌరవ చిహ్నంగా నేటికీ అక్కడ రాచరిక వారసులు కొనసాగుతున్నారు. అయితే ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 ప్యాలెస్ నిర్వహణ కోసం కేటాయించిన నిధులు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. కేవలం పది కోట్ల రూపాయిల నిధులు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇంగ్లండ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక ఈ విషయాల్ని వెల్లడించింది.

నిధుల్ని సద్వినియోగంగా వాడుకోవడం, తగినంత నిల్వ ఉంచడంలో రాణి సలహాదారులు విఫలమయ్యారని అకౌంట్స్ కమిటీ దుయ్యబట్టింది. 2001లో రాణి ప్యాలెస్ నిధులు 350 కోట్ల రూపాయిలు ఉండగా నేడు పది కోట్ల రూపాయిలకు దిగజారినట్టు పేర్కొంది. ట్రెజరీ వెంటనే గాడిన పెట్టాల్సిన అవసరముందని కమిటీలో ఉన్న ఓ ఎంపీ చెప్పారు. ప్యాలెస్ ఆర్థిక ప్రణాళిక, పర్యవేక్షణ వ్యవహారాలను పునఃసమీక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

Sakshi
Continue Reading | comments

డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!

Monday, January 27, 2014

'డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!
తెలుగు దేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికలు ఆపార్టీ నేతల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని నింపాయి. రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ, సోమిరెడ్డి, మోత్కుపల్లిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకొచ్చారు. ఓ దశలో డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా అని  చంద్రబాబుపై మోత్కుపల్లి విరుచుకుపడినట్టు సమాచారం. 
 
గతంలో కూడా ఇలాగే చేశారని బాబుపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  ఎన్ని కష్టాలెదురైనా పార్టీలోనే ఉన్నాం అయినా గుర్తించారా? అంటూ మోత్కుపల్లి నిలదీశారు. తన ఆగ్రహాన్ని మీడియాతో పంచుకునేందుకు సమావేశం హాలునుంచి బయటకొచ్చేసిన మోత్కుపల్లిని సీనియర్ నేతలు  నామా నాగేశ్వర్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు సముదాయించి లోనికితీసుకెళ్లారు.  పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభైన కాసేపటికే హరికృష్ణ, సోమిరెడ్డిలు బయటకు వచ్చారు.
Continue Reading | comments

YS Vijayamma's exclusive latest interview



Continue Reading | comments

రాజకీయాల్లోకి రానున్న వారసురాలు

Sunday, January 26, 2014

రాజకీయాల్లోకి రానున్న వారసురాలుదీప
నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం ఈసారి వారసులతోనే నడిచేట్లుగా ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడు  గౌతంరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఇక ఎన్నికలలో పోటీ చేయడమే ఆలస్యం.  మరో పక్క మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచనలతో పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇంకోపక్క బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె దీప కూడా 2014 ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ నిజమైతే నెల్లూరు జిల్లాలో ఈసారి వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతాయి.

వెంకయ్య నాయుడు -  జాతీయ స్థాయిలో ఓ పెద్ద నేత - నిత్యం జాతీయ నేతలో బిజీగా ఉంటారు - ఓ మాటల మాత్రికుడు - మీడియా ముందుకు వచ్చారంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏ భాషలోనైనా  ప్రాస తన్నుకొస్తుంది. ఆయన మాటల్లో విషయంతోపాటు ప్రాసకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన ఈ సారి ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బిజెపి తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా నుంచి బిజెపి జాతీయ నేతగా ఎదిగిన  వెంకయ్యనాయుడు  1978లో, 1983లో రెండుసార్లు ఉదయగిరి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఆత్మకూరు నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి  ప్రత్యక్ష ఎన్నికలు ఆయనకు అచ్చిరాలేదు. ఎన్నిసార్లు పోటీ చేసినా  ప్రజల ఆశీస్సులు  లభించలేదు. బాపట్ల, ఆ తరువాత హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.  వెంకయ్యకు బిజెపి అగ్రనేత అద్వానీ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఢిల్లీలో మకాం.  జాతీయ నేతగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదనే విషయం ఆయనకు తెలుసు. దాంతో అద్వానీని ప్రసన్నం చేసుకుని కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.  ప్రధాని వాజ్ పేయిని, ఉప ప్రధాని అద్వానీని, పాతిక మంది కేంద్ర  మంత్రులను జిల్లాకు తీసుకువచ్చారు. 2004లో  ఎన్నికలలో  తెలుగుదేశం పొత్తుతో బిజెపి  నెల్లూరు లోక్ సభ స్థానంలో,  అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి పరాజయం పాలైంది. రాజకీయ వారసులుగా  తన పిల్లలను తీసుకురానని  వెంకయ్య నాయుడు బహిరంగంగానే చెప్పేవారు. అయితే ఆయన మనసులో మాత్రం తన  కూతురును ప్రజా ప్రతినిధిగా చూడాలనే బలమైన కోరిక ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో తన కుమార్తె దీపను నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి  పోటీ చేయించాలని వెంకయ్య నాయుడు భావించారు. ఇందు కోసం సర్వే కూడా చేయించారు. టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తే  విజయం  సాధించే అవకాశం ఉందని అప్పట్లో అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో  చివరి దశలో  ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు.  అయితే ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తె దీపను తప్పనిసరిగా ఎన్నికల బరిలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సారి కూడా  బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు  ఉన్నాయి. ఈ క్రమంలో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి తన  కూతురిని ఎన్నికల బరిలో దింపేందుకు వెంకయ్య నాయుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీప ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వివిధ  కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  అక్షర విద్యాలయ పేరుతో స్కూలు కూడా  నిర్వహిస్తున్నారు. ఎన్నికల  బరిలో దిగేందుకు ఆమె కూడా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

source:sakshi
Continue Reading | comments

TDP Yuva Chaitanya Sadassu at KPHB Colony on 25.01.2014 Images

Continue Reading | comments

YS Jagan Samaikya Sankaravam photos 25 Jan2014
























Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger