Showing posts with label topnews. Show all posts
Showing posts with label topnews. Show all posts

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

Friday, January 31, 2014

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!

Thursday, January 30, 2014




కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Continue Reading | comments

విభజన బిల్లు తిరస్కారానికి ఆమోదం-స్పీకర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లు ను తిరస్కరించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటు గా ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనసభ ను నిరవధిక వాయిదా వేయడానికి ముందుగా ఆయన సభలో ఎందరు మాట్లాడారు? తదితర విషయాలు వివరిస్తూ ,చివరన ఆయన కిరణ్ నోటీసు ప్రబుత్వ తీర్మానం కనుక ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు.ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మనోహర్ చాలా ఉద్వేగంగా కనిపించారు.చాలా వేగంగా తన ప్రకటనను చదివి వినిపించి సభను ముగించారు. సవరణలన్నీ, అఫిడవిట్లు అన్నీ కూడా చర్చలో భాగమని ఆయన ప్రకటించారు.
Continue Reading | comments

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Continue Reading | comments

బుజ్జగింపులు, బెదిరింపులు: రంగంలోకి కెవిపి, ఫోర్జరీ..!

Wednesday, January 29, 2014

కాంగ్రెసు పార్టీలో రాజ్యసభ పోరు రసవత్తరంగా మారింది. రెబల్ అభ్యర్థులను బరిలో నుండి తప్పించేందుకు కెవిపి రామచంద్ర రావు రంగంలోకి దిగారు. రెబల్స్‌కు మద్దతిచ్చిన శాసన సభ్యులు, మంత్రులతో కెవిపి, ఆయన వర్గం చర్చలు జరుపుతోంది. మంత్రి గంటా శ్రీనివాస రావును కెవిపి బుధవారం అసెంబ్లీ లాబీల్లో కలిశారు. చైతన్య రాజును బరిలో నుండి తప్పించాలని కోరారు. మంత్రి దానం కూడా ఈ విషయమై అడిగారు. దానికి గంటా స్పందిస్తూ... పార్టీ నాలుగో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగో అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవకాశాలున్నా ఎందుకు నిలబెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాంబర్లోను కెవిపి పలువురు నేతలతో భేటీ అయి సంప్రదింపులు జరుపుతు
న్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా బుజ్జగిస్తున్నారు. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళిలు రెబల్స్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెబల్స్ పైన, వారికి మద్దతిచ్చే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైతన్య రాజుకు మద్దతు పలికిన వారు వెంటనే ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. అధిష్టానం కూడా దీనిపై ఆరా తీస్తోంది. కెవిపి ముఖ్యమంత్రిని కూడా కలిశారు. కాగా, రాజ్యసభకు నామినేషన్ వేసిన చైతన్య రాజుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారట. అయితే అందుకు చైతన్య రాజు అంగీకరించలేదని తెలుస్తోంది. ఫోర్జరీ.. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. రెబల్ అభ్యర్థులకు మద్దతిచ్చిన సంతకాలు ఫోర్జరీ అయ్యాయనే అనుమానాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సంతకాలు పెట్టారని భావిస్తున్న వారితో నేరుగా మాట్లాడాలని కోరారు.

Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/kvp-is-wooing-rebels-129445.html
Continue Reading | comments

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?

Tuesday, January 28, 2014

ఫిబ్రవరి11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ తీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ఉద్యమాలను పట్టించుకోకుండానే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టడానికి దేశ రాజధానిలో చకచకా పావులు కదుపుతోంది. ఫిబ్రవరి తొలివారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 
పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 11 తేదిన తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రి జైరాం రమేశ్  ప్రవేశపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
sakshi
బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని అనడం సబబుకాదు. అయితే నేనేమీ కిరణ్‌లాగా న్యాయ, పరిపాలనా అంశాల్లో నిపుణుడిని కాదు. అన్ని అంశాలను చర్చించిన తర్వాతే న్యాయశాఖ, కేబినెట్ ఆమోదించిన బిల్లు ఇది. జీవోఎం తయారుచేసిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ ఆమోదించాక బిల్లు అవుతుంది తప్ప ఇక్కడ మరో బిల్లు లేదు. అసలు.. నకలు అంటూ ఏదీ ఉండదు. దీనిపై చర్చ అవసరం లేదు అని సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది.
Continue Reading | comments

పార్టీని నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా?

టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం
హైదరాబాద్ : రాజ్యసభ సీటు దక్కకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన కట్టలు తెంచుకుంది. మంగళవారం హైదరాబాద్ లో మోత్కుపల్లి ను సముదాయించేందుకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి, ఎల్. రమణ, విజయరమణారావు, ఊకే అబ్బయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారి వద్ద మోత్కుపల్లి  తన ఆక్రోశాన్ని ఆయన వెళ్లకక్కారు. టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయమని మోత్కుపల్లి వాపోయారు.

పార్టీని నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సంవత్సరం నుంచి నీకే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను మభ్యపెట్టారని తోటి ఎమ్మెల్యే వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరితో మోత్కుపల్లి తీవ్ర కలత చెందారు. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం
Continue Reading | comments

రాధాకృష్ణ కు విద్యుత్ ప్లాంట్ పునరుద్దరణ

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కు చెందిన జల విద్యుత్ కేంద్రం పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.విజయవాడ వద్ద విటిపిఎస్ కెనాల్ పై ఉన్న ఈ ప్లాంటు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని విమర్శలు రావడంతో అప్పట్లో ప్రభుత్వం అనుమతిని రద్దు చేసింది. నిపుణుల కమిటీ కూడా ఈ మేరకు సిఫారస్ చేసింది. అయితే అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కక్షతో దీనిని రద్దు చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.ఆ తర్వాత దీని పునరుద్దరణకు ప్రయత్నాలు జరిగినా రోశయ్య ప్రభుత్వం కూడా ఇవ్వలేదు.తాజాగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో సాక్షి పత్రిక దీనిపై ఒక కదనాన్ని ఇస్తూ నాడు చంద్రబాబు, నేడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్లాంట్ విషయంలో రాదాకృష్ణపై ప్రేమ కనబరిచారని వ్యాఖ్యానించింది.
Continue Reading | comments

డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!

Monday, January 27, 2014

'డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!
తెలుగు దేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికలు ఆపార్టీ నేతల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని నింపాయి. రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ, సోమిరెడ్డి, మోత్కుపల్లిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకొచ్చారు. ఓ దశలో డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా అని  చంద్రబాబుపై మోత్కుపల్లి విరుచుకుపడినట్టు సమాచారం. 
 
గతంలో కూడా ఇలాగే చేశారని బాబుపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  ఎన్ని కష్టాలెదురైనా పార్టీలోనే ఉన్నాం అయినా గుర్తించారా? అంటూ మోత్కుపల్లి నిలదీశారు. తన ఆగ్రహాన్ని మీడియాతో పంచుకునేందుకు సమావేశం హాలునుంచి బయటకొచ్చేసిన మోత్కుపల్లిని సీనియర్ నేతలు  నామా నాగేశ్వర్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు సముదాయించి లోనికితీసుకెళ్లారు.  పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభైన కాసేపటికే హరికృష్ణ, సోమిరెడ్డిలు బయటకు వచ్చారు.
Continue Reading | comments

ఎన్‌టి‌ఆర్ పాత పత్రికా ఫోటోలతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై వై యస్ ఆర్ అభిమానుల ప్రచారం












 





































source: facebook

Continue Reading | comments

ఆ పార్టీకి ఈ సారి సొంతకులం ఓట్లు కూడా పడవు!

మన రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పార్టీని ఒక్కో కులం వారు ఓన్ చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రెడ్ల పార్టీగా గుర్తింపు ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో రెడ్ల హడావుడి ఉంది. రాజకీయంగా చైతన్యవంతమైన ఆ కులం వాళ్లు కాంగ్రెస్ వాదులుగా గుర్తింపు పొందారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని వైఎస్ జగన్ బ్రేక్ చేశాడు! ఒక్కదెబ్బతో రెడ్లను యాంటీ కాంగ్రెస్ గా తయారు చేశాడు. ఇప్పుడు  ఎక్కువమంది రెడ్లు జై జగన్ అంటున్నారు. ఈ విధంగా ఈ నాలుగేళ్లలో రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన సామాజిక పరిణామం చోటు చేసుకొందని చెప్పవచ్చు. 
రెడ్ల సంగతి ఇలా ఉంటే.. ఇక కమ్మ వాళ్లు తెలుగుదేశం పార్టీని  ఓన్ చేసుకొన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సంపాదించిపెట్టిపోయిన రాజకీయ ఉనికిని కమ్మవాళ్లు కాపాడుకొంటూ వస్తున్నారు. పార్టీ అనైతిక పద్ధతుల్లో ఎన్టీఆర్ చేతులన నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చినా వారు దాన్ని కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో లోక్ సత్తా రాజకీయ పార్టీగా పరిణమించింది. అంత వరకూ ఒక సామాజిక సంస్కర్తగా కనిపించిన జయప్రకాశ్ నారాయణ్ లో సామాజికి వర్గ కోణం కూడా కనిపించింది కొంతమందికి. దీంతో కమ్మవాళ్లకు కొత్త పార్టీ వచ్చినట్టు అయ్యింది.
తమ సామాజికవర్గపు మేధావిగా జేపీని గుర్తించుకొని అభిమానించడం మొదలుపెట్టారు. చాలా మంది ఓట్లు కూడా వేశారు! తెలుగుదేశం పార్టీని కాదనుకొని మరీ కొంతమంది చౌదరులు లోక్ సత్తా దారిలో నడిచిన దాఖలాలు కనిపించాయి. అయితే తీరా ఎన్నికలు అయ్యాకా అసలు విషయం బోధపడింది. లోక్ సత్తా వల్లనే మేము ఓడిపోయామని బాబు సూత్రీకరించే సరికి చౌదరులు అవాక్కయ్యారు! కమ్యూనిస్టు పార్టీలనూ, తెలంగాణ రాష్ట్ర సమితిని కలుపుకొని వెళ్లినా లోక్ సత్తా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తమను దెబ్బకొట్టిందని బాబు విశ్లేషించే సరికి లోక్ సత్తా వల్ల మన వర్గానికి నష్టం జరుగుతోందని చౌదరులు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కులాభిమానం ఉన్న కమ్మవాళ్లను కదిలిస్తే జేపీ తీరున తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందని ఒక రాజీ ఫార్ములాను సిద్ధం చేశారు. అయితే లోక్ సత్తా జేపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. దీంతో జేపీ పై ఆయన సామాజికవర్గం వాళ్లు కోప్పడుతున్నారు. ఈసారి నీకు ఓటేసేది లేదు లే అని స్పష్టం చేస్తున్నారు! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/ee-party-ki-aa-kulam-vote-lu-49964.html#sthash.Zv4caEVm.dpuf
Continue Reading | comments

జగన్‌కు మేలు చేయనున్న రాహుల్‌ పబ్లిసిటీ

రాహుల్‌ గాంధీ తాను ప్రధాని అభ్యర్థిని అని స్పష్టంగా చెప్పుకోడానికి సంకోచిస్తున్నాడు గానీ.. తాను తప్పితే కాంగ్రెస్‌పార్టీకి మరో గత్యంతరం లేదన్నట్లుగా ఎస్టాబ్లిష్‌ చేసుకునేందుకు మహా తహతహలాడిపోతున్నాడు. ఆ విషయం ఆయన కొత్తగా ప్రింట్‌, టీవీ మీడియాల్లో తీసుకువస్తున్న ప్రచారంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిచేతికీ శక్తి పేరుతో రాహుల్‌ గాంధీ ఈ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లగల యువనేత అని కీర్తిస్తూ టీవీ ప్రకటనలు ఛానెళ్లలో గుమ్మెత్తిపోతున్నాయి. ఈ ప్రకటనల ద్వారా జగన్‌కు కూడా మైలేజీ బాగానే వస్తుందని ప్రజలు ఛలోక్తులు విసురుతున్నారు. 
ఈ టీవీ ప్రకటనలో తొలుత ఒక యువతి లేదా ఒక యువకుడు మొదట తెరపైకి వస్తారు. ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం, ముందుకు తీసుకువెళ్లడం, అభివృద్ధి పథంలో నడిపించడం యువనేతకు మాత్రమే సాధ్యం అని సెలవిస్తారు. యువనేత ఘనతను కీర్తిస్తారు. చివర్లో కొన్ని సెకన్లు మాత్రం తెరమీద రాహుల్‌ బొమ్మ కనిపిస్తుంది. 
అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రకటనలో ఉన్న కంటెంట్‌ అంతా జగన్‌కు ఎక్కువ లాభించే అవకాశం ఉంది. ‘యువనేత’ అనే పదాన్ని వాడుతూ రాహుల్‌ ప్రకటన కీర్తిస్తూ పోతే.. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు యువనేత అంటే అర్థం జగన్‌ అన్నట్లుగా ప్రజల్లోకి బాగా ప్రచారం జరిగిపోయింది. నిజానికి జగన్‌ తనంతగా ఆ ప్రచారం చేసుకోలేదు. ఆయన ప్రత్యర్థి మీడియా సంస్థలే పనిగట్టుకుని ప్రచారం చేస్తూ.. ‘యువనేత’ అనే పదానికి జగన్‌ పర్యాయపదం అన్నట్లుగా స్థిరపరిచారు. ఇప్పుడు ఎవ్వరికైనా జగన్‌ ముందు స్పురిస్తాడు. 
పైగా రాహుల్‌ కోసం రూపొందించిన ప్రకటన మొత్తం యువనేత ఫోకస్‌తోనే సాగుతుంది. అంటే నరేంద్రమోడీ కంటె తాను యూత్‌ అని ఆయన రాహుల్‌ ఫీల్‌ కావొచ్చు గానీ.. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాహుల్‌ కంటె జగన్‌ యూత్‌ అని ప్రజలు ఫీల్‌ అయితే ఏం చేస్తారో?
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-melu-cheyyanunna-rahul-49950.html#sthash.krGxHKvX.dpuf
Continue Reading | comments

కిరణ్ కు రాజ్యాంగంపై ఉన్న పట్టు నాకు లేదు

తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు.

అదే సమయంలో కిరణ్ పై వ్యంగ్యాస్త్రం సందించారు.రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు.
తెలంగాణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని... బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు.
Continue Reading | comments

జగన్నాటకానికి నేటితో తెర

ఆయన ఆస్కార్‌కు అర్హుడు
సోనియాతో ఒప్పందం ప్రకారమే అసెంబ్లీలో డ్రామాలు
విభజన కోసం గుంటనక్కలా ఎదురుచూపులు: ధూళిపాళ
'సమైక్య' అర్హత జగన్‌కు లేదు: ముద్దు
హైదరాబాద్/పుత్తూరు, జనవరి 26: వైసీపీ అధ్యక్షుడు జగన్.. సమైక్య ముసుగులో నాటకాలు ఆడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు విరుచుకుపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. సమైసమైక్యవాదాన్ని వినిపించకుండా రోజూ సభకు వచ్చి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేల జగన్నాటకానికి సోమవారం తెరపడుతుందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకు వైసీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్న జగన్ ఆస్కార్ అవార్డుకు అర్హుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు, రూల్-77కింద టీడీపీ ఇచ్చిన తీర్మానం మేరకు సోమవారం సభలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెప్పారు. బిల్లును ఎలా తిప్పిపంపాలని తాము ఆలోచిస్తుంటే రాష్ట్ర విభజన ఖాయమంటూ పార్టీ శ్రేణులకు జగన్ సంకేతాలివ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
సోనియా, కాంగ్రెస్ హై కమాండ్‌తో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడం, మార్నింగ్ షో అయిపోగానే ఇంటికెళ్లి పడుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. విభజన ఎంత తొందరగా జరుగుతుందా? అని గుంటనక్కలా ఎదురుచూస్తున్న జగన్ బండారం సోమవారం సభలో బయటపడుతుందన్నారు. కాగా, రాష్ట్రంలో విభజన చిచ్చుపెట్టింది తన తండ్రేనని తెలిసీ.. ఇడుపులపాయలో ఆర్టికల్ 3 గురించి ప్రకటన చేసిన జగన్‌కు.. ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం పాటు పడుతున్న చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడి, జైలు పాలై బెయిల్ కోసం సోనియా కాళ్ల వద్ద మోకరిల్లిన జగన్.. సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విభజనపై కేంద్రం పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తే వీగిపోయేదని అభిప్రాయపడ్డారు. అలాంటి కీలక చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా వాకౌట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది జగన్, విజయమ్మ చెప్పాలని డిమాండు చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/58569#sthash.P8RiVMOo.dpuf
Continue Reading | comments

దేవినేని ఉమా అసంతృప్తి !

దేవినేని ఉమా అసంతృప్తి !
 టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) తనపై దుష్ర్పచారం చేస్తూన్నారంటూ  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పార్టీ పరిశీలకుడు సుజానాచౌదరి వద్ద  ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాలతో పాటు పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సుజానా చౌదరి ఆదివారం మధ్యాహ్నం బందరురోడ్డులోని ఒక హోటల్‌లో బస చేసినప్పుడు దేవినేని ఉమా వ్యక్తిగతంగా కలిసి తన నిరసన తెలియజేశారు.

కేశినేని నాని తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా జిల్లాలోని  పార్టీ  ముఖ్యనేతల వద్ద మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రతిష్టే కాకుండా పార్టీ ప్రతిష్ట  దెబ్బతింటుదని చెప్పారు.ఈ అంశాన్ని  తాను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లతానని చెప్పగా, సుజనా చౌదరి వారించి  పరిస్థితిని ఇక్కడే చక్కదిద్దుకుందామని సర్థి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
పార్టీ శ్రేణులకు  తలనొప్పి....

ఇప్పటికే కేశినేని, దేవినేని మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ఈ పోరు తారాస్థాయికి చేరుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది.  ఇప్పటికే జి ల్లాలో పార్టీ తీరు అంతంత మాత్రంగా ఉండగా... ఇ ప్పుడు ఇరువురు ముఖ్యనేతలు నువ్వా-నేనా అన్న ట్లు తలపడుతూ ఉండటం కలవరపాటుకు గురిచేస్తుంది.
 
చంద్రబాబు వద్దకు జిల్లా ముఖ్యులు....
 
నగరంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు   సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు పార్ధీవశరీరాన్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కినేని మృతదేహాన్ని సందర్శించిన అనంతరం వారంతా వెళ్లి చంద్రబాబునాయుడ్ని కలిశారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చకు రాగా కేశినేని-దేవినేని మధ్య విభేదాలు, ఇటీవల కాళేశ్వరీ రవీ ప్లెక్సీల వివాదం గురించి   వివరించినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి చక్కదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చి వారిని పంపారని సమాచారం.
 http://www.sakshi.com/news/andhra-pradesh/devineni-uma-unsatisfied-on-kesineni-nani-100689?pfrom=home-top-story
Continue Reading | comments

పిక్‌పాకెటర్ అనుకుంటే బాంబులు పేల్చాడు

Sunday, January 26, 2014

పిక్‌పాకెటర్  అనుకుంటే బాంబులు పేల్చాడుయాసిన్ భత్కల్
 బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో తమకు సంబంధం ఉందని ఇండియన్ ముజాహుద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. విచారణ అధికారులు యాసిన్ నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. బాంబు పేలుళ్ల ఘటనకు పక్షం రోజుల ముందు తుమకూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే బాంబులు తయారు చేసినట్లు భత్కల్ చెప్పినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం బాంబు పేలుళ్ల ఘటనకు మూడు రోజుల ముందు యాసిన్ భత్కల్ తుమకూరు నుంచి బస్సులో బెంగళూరు చేరుకున్నాడు. తరువాత మెజస్టిక్, గాంధీబజార్, కబ్బన్‌పార్క్, చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలలో తిరిగాడు. 2010 ఏప్రిల్ 17న బెంగ ళూరు రాయల్ చాలెంజర్ - ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని అక్కడే బాంబులు పెట్టాలని యాసిన్ భత్కల్ నిర్ణయించాడు.

ఏప్రిల్ 16న చిన్నస్వామి స్టేడియం దగ్గర యాసిన్ భత్కల్ అనుమానాస్పదంగా కనిపించడంతో పిక్‌పాకెట్ చేసే వ్యక్తిగా భావించిన పోలీసులు  రెండు దెబ్బలు వేసి పంపించి వేశారు. ఏప్రిల్ 17 వేకువజామున చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబులు పెట్టారు. మ్యాచ్ ప్రారంభం కాక మునుపే పేలుళ్లు సృష్టించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.  అనంతరం గాంధీబజార్, బీవీకే అయ్యంగార్ రోడ్లలో బాంబు పేలుళ్లు సష్టించాలని స్కెచ్ వేసిన యాసిన్ భత్కల్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు  విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

sakshi
Continue Reading | comments

TDP Yuva Chaitanya Sadassu at KPHB Colony on 25.01.2014 Images

Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger