Showing posts with label latest. Show all posts
Showing posts with label latest. Show all posts

వైసీపీ నుండి వెళ్లిపోవట్లేదు ...

Wednesday, January 29, 2014

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్‌, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
Continue Reading | comments

చోరీ సొత్తు అమ్మలేక

చోరీ సొత్తు అమ్మలేక లొంగిపోయారు
హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ ను పోలీసులు ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి నిందితుడు భూమన కిరణ్ కుమార్ ను ఇంతకుముందే లొంగిపోయాడు. వీరిద్దరూ పథకం ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.

మూడుసార్లు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పథకం నిర్వహించారని చెప్పారు. కిరణ్ ప్రణాళిక రచించగా ఆనంద్ అమలు చేశాడని వెల్లడించారు. స్కూ డ్రైవర్ పై చేతి రుమాలు పెట్టి సుత్తితో కొట్టి గోడ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. కిరణ్ బయట కాపలాగా ఉండగా ఆనంద్ దుకాణం లోపలకు వెళ్లి దొంగతనం చేశాడని చెప్పారు. మూడు బ్యాగుల్లో నగలు ఎత్తుకు పోయారని చెప్పారు. అయితే  సంఘటనా స్థలంలో ఆధారాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డారని వెల్లడించారు. ఐరీష్ కనబడకుండా కళ్లద్దాలు, తల వెంట్రుకలు ఘటనా స్థలంలో పడకుండా జెల్ రాసుకున్నారని చెప్పారు. పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా కారప్పొడి చల్లారని తెలిపారు.

చోరీ సొత్తు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భయపడిపోయి కిరణ్ కుమార్ లొంగిపోయాడని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లాడని పేర్కొన్నారు. వేరే వాళ్ల ప్రమేయం ప్రత్యక్షంగాని, పరోక్షంగాని కనబడలేదన్నారు.

sakshi
Continue Reading | comments

2013.. ఓ ప్రేమ కథ

2013 జనవరి, అమెరికాలోని కాలిఫోర్నియా..
 ఆడ్రియానా పెరాల్. ఆమె లైఫ్ స్టైలే వేరు. బికినీలు, హైహీల్స్..
 రోజూ పార్టీలు, వైన్, విస్కీ.. తాగి తూగడం.. పొద్దున్నే జిమ్.. అంతా హైఫై.
 సీన్.. కట్ చేస్తే...

 
 2014 జనవరి, హర్యానాలోని పాప్‌రాన్ గ్రామం..
 ఆడ్రియానా పెరాల్. చుడీదార్, నెత్తిన కొంగు, నుదుటన సింధూరం.. పిడకల పొయ్యి మీద వంట వండుతోంది.. గేదెలను పీచుతో తోముతోంది.. అంట్లు తోముతోంది.. ఇళ్లూడుస్తోంది.. ఇక్కడ పార్టీలు లేవు. టాయిలెట్‌కు పోవాలన్నా బయటకు వెళ్లాల్సిందే.. షవర్ సంగతి సరేసరి.. స్నానానికి గేదెలకు, మనుషులకు ఒకటే బకెట్!
 
 ఏమిటీ మాయ.. అవును. ప్రేమ చేసిన మాయ. ఆడ్రియానా ప్రేమలో పడింది. అన్నీ వదిలొచ్చేసింది.. సంతోషంగా.. చిత్రంలో కనిపిస్తున్న ఆడ్రియానా, ముకేష్‌కుమార్‌ల ప్రేమ కథలోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఆడ్రియానా(40)కు ముకేష్(24) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు చాట్ చేసుకున్నారు. ఒక్కరోజు హఠాత్తుగా ముకేష్ ఆడ్రియానాకు ఫోన్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆడ్రియానా నవ్వేసింది. ఏమిటీ పిచ్చిమాటలు నీ వయసెంత.. నా వయసెంత అంది. నాకు నీ వయసు కూతురుందని చెప్పింది. ముకేష్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా ఇదే తీరు. ఆడ్రియానా ఆలోచనలో పడింది. తర్వాత ఇద్దరూ ఇన్ లవ్. ఆడ్రియానా ముకేష్ కోసం కాలిఫోర్నియాను వదిలి భారత్‌కు వచ్చేద్దామని గతేడాది ఆగస్టులో డిసైడైంది. ఇంట్లో వాళ్లు వారించారు.
 
  కూతురైతే.. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని చెప్పింది. ముకేష్ ఆన్‌లైన్ మోసగాడని వారించింది. ఆడ్రియానా ముకేష్‌ను నమ్మింది. వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో దిగగానే ముకేష్. నేరుగా పాప్‌రాన్ గ్రామానికి.. నవంబర్‌లో సంప్రదాయరీతిలో వివాహం. అమెరికా లైఫ్‌స్టైల్‌కి.. ఇక్కడి జీవనశైలికి ఎంతో తేడా. అయితేనేం.. అలవాటుపడిపోయింది.. హిందీ మాట్లాడటం నేర్చుకుంటోంది. బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడే భర్తకు ఇంగ్లిష్ నేర్పిస్తోంది.  సాగులో సాయమూ చేస్తోంది. ఇక ఆడ్రియానా అత్తగారైతే.. ఆమెపై ప్రశంసలే ప్రశంసలు.
Continue Reading | comments

ఎన్‌టి‌ఆర్ పాత పత్రికా ఫోటోలతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై వై యస్ ఆర్ అభిమానుల ప్రచారం

Monday, January 27, 2014












 





































source: facebook

Continue Reading | comments

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ బయటకు ..

పోలిట్ బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణనందమూరి హరికృష్ణ
హైదరాబాద్: టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు  ఆ పార్టీ పోలిట్ బ్యూరో ఈ రోజు సమావేశమైంది.  తాను రాజ్యసభ టిక్కెట్ రేసులో ఉన్నట్లు హరికృష్ణ తెలిపారు.  తాను టిక్కెట్ ఆశిస్తున్నందున సమావేశంలో ఉండటం మంచిదికాదని బయటకు వచ్చినట్లు చెప్పారు.

సమైక్య రాష్ట్రం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు హరికృష్ణ చెప్పారు.
Continue Reading | comments

కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు

కాంగ్రెస్ కు డిపాజిట్లు దక్కవు:లగడపాటి రాజగోపాల్
గుంటూరు:రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన తరుణంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు సొంతపార్టీ కాంగ్రెస్ పై మండిపడ్డారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రలో కాంగ్రెస్ డిపాజిట్లు దక్కవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లగడపాటి.. విభజనపై కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటానికి దిగుతామని తెలిపారు.
 
ఈ క్రమంలో విద్యార్థులను, మేధావులను సంఘటితం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని లగడపాటి తెలిపారు.

sakshi
Continue Reading | comments

సి.ఎమ్.క్రిమినల్ బ్రెయిన్ తో ఈ పని చేశారు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ తో తెలంగాణ బిల్లును తిరస్కరించాలని అంటూ నోటీస్ ఇచ్చారని,స్పీకర్ ను ఇరకాటంలో పెట్టడానికి కూడా కిరణ్ ఇలా చేసినట్లు గా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.నలభై రెండు రోజుల పాటు చర్చ జరిపిన తర్వాత ,అప్పట్లో చర్చ జరగాలని కూడా కోరిన కిరణ్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం చూస్తూ క్రిమినల్ ఆలోచనతో చేస్తున్నట్లుగా కనిపిస్తుందని అన్నారు.తాను ఛాంపియన్ అయి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను ఇరకాట పరిస్థితి లోకి నెట్టాలన్న ఉద్దేశంతో చేసినట్లుగా ఉందని అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా కూడ బలుక్కుని,పరస్పరం సహకరించుకున్న తీరు అన్నదమ్ముల్లా వ్యవహరించినట్లుగా ఉందని సాంబశివరావువ్యాఖ్యానించారు.

kommineni
Continue Reading | comments

జగన్నాటకానికి నేటితో తెర

ఆయన ఆస్కార్‌కు అర్హుడు
సోనియాతో ఒప్పందం ప్రకారమే అసెంబ్లీలో డ్రామాలు
విభజన కోసం గుంటనక్కలా ఎదురుచూపులు: ధూళిపాళ
'సమైక్య' అర్హత జగన్‌కు లేదు: ముద్దు
హైదరాబాద్/పుత్తూరు, జనవరి 26: వైసీపీ అధ్యక్షుడు జగన్.. సమైక్య ముసుగులో నాటకాలు ఆడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు విరుచుకుపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. సమైసమైక్యవాదాన్ని వినిపించకుండా రోజూ సభకు వచ్చి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేల జగన్నాటకానికి సోమవారం తెరపడుతుందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకు వైసీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్న జగన్ ఆస్కార్ అవార్డుకు అర్హుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు, రూల్-77కింద టీడీపీ ఇచ్చిన తీర్మానం మేరకు సోమవారం సభలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెప్పారు. బిల్లును ఎలా తిప్పిపంపాలని తాము ఆలోచిస్తుంటే రాష్ట్ర విభజన ఖాయమంటూ పార్టీ శ్రేణులకు జగన్ సంకేతాలివ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
సోనియా, కాంగ్రెస్ హై కమాండ్‌తో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడం, మార్నింగ్ షో అయిపోగానే ఇంటికెళ్లి పడుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. విభజన ఎంత తొందరగా జరుగుతుందా? అని గుంటనక్కలా ఎదురుచూస్తున్న జగన్ బండారం సోమవారం సభలో బయటపడుతుందన్నారు. కాగా, రాష్ట్రంలో విభజన చిచ్చుపెట్టింది తన తండ్రేనని తెలిసీ.. ఇడుపులపాయలో ఆర్టికల్ 3 గురించి ప్రకటన చేసిన జగన్‌కు.. ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం పాటు పడుతున్న చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడి, జైలు పాలై బెయిల్ కోసం సోనియా కాళ్ల వద్ద మోకరిల్లిన జగన్.. సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విభజనపై కేంద్రం పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చిస్తే వీగిపోయేదని అభిప్రాయపడ్డారు. అలాంటి కీలక చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా వాకౌట్ చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది జగన్, విజయమ్మ చెప్పాలని డిమాండు చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/58569#sthash.P8RiVMOo.dpuf
Continue Reading | comments

సంచలనం కోసమే తనిష్క్ లో చోరీ

జనంలో కన్పించాలన్న ఉద్దేశంతోనే తనిష్క్ బంగారం నగల దుకాణంలో దొంగతనం చేశానని కిరణ్ అనే యువకుడు తెలిపాడు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు అతడు ఒక ప్రైవేటు వార్తా చానల్తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు తెలిపాడు. ఐదు నిమిషాలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా సంఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు చెప్పాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు చెప్పాడు.

రాజకీయ నాయకుల అవినీతిని ఎత్తి చూపడానికే దొంగతనం చేసినట్టు కిరణ్ తెలిపాడు. దొంగతనానికి, రాజకీయానికి తేడా లేదన్నాడు. తాను ఒక రాత్రి దొంగ అయితే, రాజకీయ నాయకులు ఐదేళ్ల దొంగలని విమర్శించాడు. వ్యవస్థలో మార్పు రావాలని అతడు ఆకాంక్షించారు. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే తనను అవహేళన చేశారని చెప్పాడు. ప్రెసిడెంట్గా పోటీ చేసి ఊరిని బాగుచేయాలనుకున్నా అవకాశం ఇవ్వలేదన్నాడు. తనకు ఉద్యోగం లేకపోవడం, సమాజంలో మంచితనం లేకపోవడం వల్లే దొంతనం చేశానన్నాడు. తన వెనుక ఎవరూ లేరన్నారు.

ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించానని చెప్పాడు. చనిపోయే హక్కు తనకు లేదని విరమించుకున్నట్టు చెప్పాడు. ఏదోక సంచలనం చేసి జనం దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో తనిష్క్లో చోరీ చేసినట్టు చెప్పాడు. జనం, రాజకీయం, సమాజంలో మార్పు రావాలని
ఆకాంక్షించాడు. తనకు అవకాశమిస్తే వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానన్నాడు. ప్రజలను బాగు చేయగలన్న నమ్మకం తనకుందన్నాడు.

తనిష్క్ లో తానే చోరీ చేశానని కిరణ్ చెబితే పోలీసులు మొదట నమ్మలేదు. తన గదిలో దాచిన దొంగిలించిన సొమ్మును చూపించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు చెబుతున్న మాటల్లో వాస్తమెంత, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని గురించి  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 http://www.sakshi.com/news/andhra-pradesh/guntur-young-man-tanishq-jewellery-looted-in-hyderabad-100771
Continue Reading | comments

Chandrababu Naidu Flag Hoisting photos at NTR Bhavan

Sunday, January 26, 2014


















Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger