Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts

అందరిని పరుగు పెట్టిస్తాం

Friday, January 31, 2014

డిల్లీలో పార్లమెంటు సబ్యులను పరుగు పెట్టించడానికి విశాఖపట్నం లో సమైక్యపరుగు నిర్వహించామని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు డిల్లీలో జరిగే ఛలో డిల్లీ ఆందోళనకు అందరూ కలిసిరావాలని ఆయనపిలుపు ఇచ్చారు. పిబ్రవరి ఇరవై ఒక్కటిన పార్లమెంటు సమావేశాల చివరి రోజు అని ,ఈలోగా సమైక్య రాష్ట్రం కోసం మనం అప్రమత్తంగా ఉండి, ఆ రోజు విజయోత్సవం జరుపుకోవచ్చని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Continue Reading | comments

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం తప్పదా!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదా?ఎఐసిసి ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి(ని విలీనం చేయాల్సిందేనని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం విశేషం. తెలంగాణ బి్ల్లుపై శాసనసభ లో చర్చ పూర్తి అయ్యాక ఆయన ఈ విషయం చెప్పడం విశేషం.ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నూటికి నూరుశాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
Continue Reading | comments

12 యేళ్లకు అవకాశమొస్తే దాన్నీ తన్నుకుపోయాడు!

Thursday, January 30, 2014

తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మధ్య పుష్కర వేడుకలను పూర్తి చేసుకొంది. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే టైమ్ కాస్తంత కలిసి వస్తోంది. కాంగ్రెస్ రాజకీయాల పుణ్యామా అని తెలంగాణ రాష్ట్ర సమితి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ సమయంలో టీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని ఫాంటసీలు కూడా వాస్తవంలో నిజం అవుతున్నాయి. 
అలాంటి ఫాంటసీల్లో ముఖ్యమైనది రాజ్యసభ సభ్యత్వం. ఇప్పుడు తొలిసారి రాజ్యసభలో టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వ్యక్తి తన్నుకుపోతున్నాడని గులాబీ కండువాలు ఫీలవుతున్నాయి. తెరాస తరపున కే కేశవరావు రాజ్యసభకు నామినేషన్ వేశాడు. ఈయన కు తెరాస సభ్యత్వం ఉంది కదా, ఈయన కాంగ్రెస్ వాడు ఎలా అవుతాడు? అని అంటే.. ఆయన నిన్నలా మొన్న టీఆర్ఎస్ లో చేరాడని, దశాబ్ధకాలంగా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ ను  అనేక మాటలు అని ఇప్పుడు టీఆర్ఎస్ చేరిన ఆరు నెలల్లోనే రాజ్యసభకు వెళ్తున్నాడనేది గులాబీ దళ నాయకుల భావన. 
అది కూడా ఇది ఊరికే లభిస్తున్న అవకాశం కాదు. 12 సంవత్సరాల కు దక్కుతున్న అవకాశం. ఇలాంటి అవకాశాన్ని పార్టీ సిద్ధాంత కర్తల్లో ఎవరో ఒకరికి ఇస్తే బావుంటుండేది కానీ, ఇలా నిన్నలా మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చేస్తే ఎలా? అని టీఆర్ఎస్ నాయకులు గొణుక్కొంటున్నారు. అయితే ఇది అధినేత స్థాయిలో జరిగిపోయిన నిర్ణయం కాబట్టి ఇక చేయగలిగిందేమీ లేదన్న నిరాసక్తత కూడా కనిపిస్తోంది వారిలో. అయితే వాస్తవానికి ఇప్పుడు కూడా టీఆర్ఎస్   రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకొనేది  సొంత శక్తితో కాదు కదా... కాంగ్రెస్ సభ్యుల సహకారం అందిస్తేనే కేకే గెలవగలడు. ఈ లెక్కన సగం కాంగ్రెస్ బలం, సగం టీఆర్ ఎస్ బలం.. అభ్యర్థి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి న్యాయం జరుగుతున్నట్టే! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/12-samvatsaralaku-avakasam-vasthe-danni-50048.html#sthash.wL3f2IXs.dpuf
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!




కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. కాగా బిజెపి నేత వెంకయ్య నాయుడు ను రఘురామరాజు తన ఇంటికి ఆహ్వానించి, బిజెపిలో చేరే విషయమై చర్చించారని కదనాలు రావడంతో పార్టీ ఈ చర్య తీసుకుంది
Continue Reading | comments

కెవిపి కూడా విలపించారా

శాసనసభ ఆవరణలో ఇద్దరు పెద్ద నేతలు విలపించారంటూ వచ్చిన కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ,సిట్టింగ్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ఉన్నారన్న కధనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.టిడిపి లో రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు శాసనసభ ప్రాంగణంలో కంటతడిపెట్టి రోదించారని ఇప్పటికే కధనం రాగా,తాజాగా కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావు కూడా విలపించారని వార్త రావడం విస్మయం కలిగిస్తుంది.మంత్రి గంటా చాంబర్ లో తిరుగుబాటు అభ్యర్ధులు చైతన్య రాజు, గంటా శ్రీనివాసరావులను తప్పించడం కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని మంత్రి గంటాను ప్రశ్నిస్తూ కేవీపీ బిగ్గరగా రోదించారని మీడియాలో కధనం వచ్చింది.దీంతో అక్కడ ఉన్న నేతలంతా విస్తుపోయారు.తాను విభజనవాదినా అని ఆయన ప్రశ్నించారట. ఎన్నో డక్కామక్కీలు తిన్న కెవిపి కూడా నిజంగా అలా చేసి ఉంటారా..

తాను రోదించానంటూ ఒక పత్రికలో వచ్చిన కధనాలపై సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. తనకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ శాసనసబలో ముప్పైఏడు మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోలేకపోతే ఇక రాజకీయాలలో ఉండి లాభం ఏమిటి అని ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే.అనేకమదికి టిక్కెట్లు ఇప్పించడంలో, ప్రభుత్వం నడపడంలో కీలక పాత్ర పోషించిన కెవిపి రాజ్యసభ ఎన్నికలలో కొందరు తిరుగుబాటుదార్లు పోటీచేస్తున్న సందర్భంలో చర్చలలో కెవిపి రోదించారని కదనం వచ్చింది. అది నిజమా అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానిపై కెవిపి వివరణ ఇవ్వడం సరిగానే ఉంది.
Kommineni
Continue Reading | comments

రఘురాజు విభజన వాద బిజెపిలో ఎలా చేరతారో

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని బావిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంటికి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు వెళ్లడం చర్చనీయాంశం అయింది. రాజు బిజెపిలో చేరి నరసాపురంలో పోటీచేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. కొందరు శాసనసభ అభ్యర్దుల విషయంలో వచ్చిన విబేదాలతో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దూరం అవుతున్నారని అంటున్నారు.అయితే వీర సమైక్యవాదనని, సుప్రింకోర్టులో కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాడతానని చెబుతున్న రాజు విభజనవాద పార్టీ అయిన బిజెపిలో ఎలా చేరతారబ్బా!ఇదే రాజకీయ విచిత్రం అంటే
Continue Reading | comments

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
న్యూఢిల్లీ : గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది.
Sakshi
Continue Reading | comments

తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఓడిపోలేదు

తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఓడిపోలేదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగలేదని...బిల్లు ఓడిపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని... దాన్ని అందరూ గమనించాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. విభజన బిల్లుపై ఫైటింగ్ జరగలేదని... సభ అభిప్రాయం కోసమే బిల్లు పంపామన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని అన్నారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ అన్నారు. కేంద్ర కేబినెట్ లో చర్చ అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 ప్రకారమే ముందుకు వెళతామన్నారు. అసెంబ్లీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందన్నారు.
ఇరు ప్రాంతాల కాంగ్రెస్ సభ్యుల్లో పరస్పర అభిప్రాయాలు ఉన్నందున... సభలో వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలువరించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వచ్చిన సవరణల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటిని బిల్లులో చేర్చే విషయాన్ని కేబినెట్ చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తామన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ ఆశాభావం వక్యతం చేశారు

sakshi
Continue Reading | comments

విభజన బిల్లు తిరస్కారానికి ఆమోదం-స్పీకర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లు ను తిరస్కరించాలని ప్రతిపాదిస్తూ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటు గా ఆమోదించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.శాసనసభ ను నిరవధిక వాయిదా వేయడానికి ముందుగా ఆయన సభలో ఎందరు మాట్లాడారు? తదితర విషయాలు వివరిస్తూ ,చివరన ఆయన కిరణ్ నోటీసు ప్రబుత్వ తీర్మానం కనుక ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు.ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మనోహర్ చాలా ఉద్వేగంగా కనిపించారు.చాలా వేగంగా తన ప్రకటనను చదివి వినిపించి సభను ముగించారు. సవరణలన్నీ, అఫిడవిట్లు అన్నీ కూడా చర్చలో భాగమని ఆయన ప్రకటించారు.
Continue Reading | comments

నిబంధనలను ఉల్లంఘించి శాసనసభా పోడియం వద్దకు వెళ్ళిన సి‌ఎం రమేష్

టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శాసనసభ నిబంధనలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినప్పటికీ బుధవారం శాసనసభా మందిరంలోకి ప్రవేశించారు. ఏకంగా పోడియం వద్దకు వెళ్లారు. హాల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలతో నిరాటంకంగా మంతనాలు జరిపారు. శాసనసభా మందిరంలోకి ఎమ్మెల్యేలతో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులు ఎవరైనా ప్రవేశించాలంటే స్పీకర్ అనుమతి తప్పనిసరి. అరుుతే.. విభజన బిల్లును
వెంటనే రాష్ట్రపతికి తిప్పి పంపాలని, బిల్లుపై చర్చకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు రమేష్ వారి వద్దకు వచ్చారు.
 
దీనిపై తాము 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసు మేరకు వెంటనే ఓటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సభ లోపలే ఉండి ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు మీడియాకు సైతం విడుదలయ్యాయి. రమేష్ రాకను టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్ధించారు. ఈ విషయం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి సాకే శైలజానాథ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం రమేష్  ఉదయం తన పార్టీ నేతలతో పాటు అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో పీసీసీ చీఫ్ బొత్సతో, సీఎం చాంబర్‌కు వెళ్లి కిరణ్‌తో మంతనాలు కొనసాగించారు.
Continue Reading | comments

తెలంగాణకు 5 లక్షల కోట్లు ....


తెలంగాణకు 5 లక్షల కోట్లు ఇవ్వాలి: హరీష్‌రావు
 విభజన తరువాత తెలంగాణ పునర్మిర్మాణానికి కేంద్రం రూ. 5 లక్షల కోట్లు ప్యాకేజీగా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు.  బిల్లుపై తన అభిప్రాయం చెబుతూ 65 పేజీల లేఖను స్పీకర్‌కు అందజేశారు. తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపి, బిల్లును వెంటనే పార్లమెం ట్‌కు పంపాలని కోరారు. తెలంగాణ అమరవీరులు మరణ వాంగ్మూలాల్లో రాసిన అభిప్రాయాలను లేఖలో పేర్కొన్నారు.
  వైఎస్,  కిరణ్, బాబు, జగన్, విజయమ్మ, షర్మిల, చిరంజీవి వివిధ సందర్భాల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మాటలతో కూడిన సీడీల ను సమర్పించారు. సింగరేణి బొగ్గు ఎంత సీమాం ధ్రకు సరఫరా అయిందో తెలిపే డాక్యుమెంట్లు, సచి వాలయం, హైకోర్టులో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య కు సంబంధించిన పత్రాలను జతపరిచారు. స్వాతంత్య్రం తర్వాత 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, ఏ రాష్ట్రానికీ లేని విధంగా తెలంగాణకు షరతులు, ఆంక్షలు, అధికారాల్లో కోతలు విధించడం సరికాదన్నారు.
Continue Reading | comments

వైసీపీ నుండి వెళ్లిపోవట్లేదు ...

Wednesday, January 29, 2014

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్‌, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
Continue Reading | comments

స్టాలిన్ కు భద్రత పెంచండి

ప్రధాని గారూ.. స్టాలిన్ కు భద్రత పెంచండి
చెన్నై: తమిళనాట డీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తన కుమారుడు స్టాలిన్ కు భద్రత పెంచాల్సిందిగా డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. కరుణానిధి ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

స్టాలిన్ మూడు నెలల్లో చనిపోతాడు అంటూ మరో కుమారుడు అళగిరి తనతో అన్నాడంటూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అందుకే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తూ.. 'పుట్టిన ప్రతివాళ్లూ ఏదో ఒకరోజు చావాల్సిందే' అనడం విపరీతార్థాలకు దారితీసింది. అళగిరి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాలనే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారట. తన గురించి అన్నయ్య అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకోవట్లేదని చెప్పారు.
Continue Reading | comments

టి.బిల్లు పెడితే రాజకీయ సన్యాసం-కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు.తెలంగాణ బిల్లు విషయంలో ఇది అసలు బిల్లు కాదని ,ముసాయిదా బిల్లు మాత్రమేనని ఆయన వాదించారు.పైగా హోం శాఖ రాష్ట్రపతిని మోసం చేసిందని ఆయన విమర్శించారు.కరణ్ చేసిన ఈ సంచలన ప్రకటన తో తెలంగాణ ఇక తధ్యం అన్న అబిప్రాయం బలపడుతుంది
Continue Reading | comments

టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో మాకు భద్రత కల్పించండి: టీజీ
హైదరాబాద్ : అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే విధ్వంసానికి  అవకాశం ఉందని మంత్రి టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ ముగిశాక తమపై దాడి జరిగే అవకాశం ఉన్నందున తమకు భద్రత కల్పించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ముందే చర్య తీసుకోవాలని,ఓడిపోతామనే భయంతో ఓటింగ్ కు ఒప్పుకోవటం లేదని టీజీ అన్నారు.

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ను వెంటనే పెట్టాలని మంత్రి టిజి వెంకటేష్ కోరారు. ఓటింగ్ ముగిశాక శాసనసభలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. అందువల్ల శాసనసభ్యులకు బద్రత కల్పించాలని కూడా ఆయన సలహా ఇస్తున్నారు.అలాంటప్పుడు ఇక్కడ ఓటింగ్ పెట్టి విధ్వంసానికి అవకాశం ఇవ్వడం ఎందుకో?టిజి వెంకటేష్ గారు భయపడే విదంగా పరిస్థితి రాకూడదు సుమా
Continue Reading | comments

కంటతడి పెట్టిన మోత్కుపల్లి

కంటతడి పెట్టిన మోత్కుపల్లి
హైదరాబాద్ : రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అసెంబ్లీ లాబీలో కంటతడి పెట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాజ్యసభ సీటు ఖాయమని అందరు అనుకున్నారని మోత్కుపల్లి అన్నారు.
రాజ్యసభ సీటు విషయంలో తాను అవమానానికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తలదించుకోకూడదనే కష్టపడి పనిచేశానని అన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లిని మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బుజ్జగించారు. కాగా ఈరోజు ఉదయం మోత్కుపల్లిని ...పార్టీ నేతలు  చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించిన విషయం తెలిసిందే.
Continue Reading | comments

ఇంత వయసొచ్చింది. నోరు అదుపులో పెట్టుకో

"ఇంత వయసొచ్చింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. శిశుపాలుడి తప్పుల్లా నీ తప్పులూ లెక్కపెడుతున్నాం'' అంటూ మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంగళవారం సీఎం కిరణ్‌ను పార్టీ రాష్ట్ర పరిశీలకులు కుంతియా, తిరునావక్కరసుతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పీసీసీ ప్రోటోకాల్ ఇన్‌చార్జి వేణుగోపాల్ కలిశారు. త
ర్వాత వారు బయటకు వస్తున్న సమయంలో జేసీ వారికి ఎదురుపడ్డారు.
ఈ సమయంలో ఒక నాయకునితో జేసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లాలూచీ పడిందని వ్యాఖ్యానించారు. దీంతో సత్తిబాబు జోక్యం చేసుకున్నారు. "ఏమిటీ లాలూచీ అంటున్నావు? నీకు ఇంత వయసొచ్చింది. నోటిని అదుపులో పెట్టుకో. శిశుపాలుడిలా మాట్లాడు తున్న నీ తప్పులు లెక్క పెడుతున్నాం. కాంగ్రెస్‌లో ఉంటూ పదవులు పొందావు. రాజకీయంగా ఉన్నతి సాధించావు. ఆర్థికంగా లాభపడ్డావు. ఇప్పుడు కాంగ్రెస్‌ను అంటే ఎలా!?'' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో, జేసీ కాస్త నవ్వుతూ.. నేను లాలూచీ పడ్డారని అంటే ఎందుకంత ఆగ్రహం అని ఎదురు ప్రశ్న వేశారు. ముగ్గురు అభ్యర్థులను నిలిపిన తర్వాత ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అదనంగా ఉన్నారని, అయినా నాలుగో అభ్యర్థిని ఎందుకు నిలపలేదని ప్రశ్నించారు. ఇది టీఆర్ఎస్‌తో లాలూచీ కావడం కాదా అని జేసీ దివాకర్ రెడ్డి నిలదీశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/59506#sthash.T26kEBZE.dpuf
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger