Home » , , , , , , , , , , , , , » వామపక్షాల మధ్య వై.కాంగ్రెస్ పొత్తు చిచ్చు

వామపక్షాల మధ్య వై.కాంగ్రెస్ పొత్తు చిచ్చు

వామపక్షాల మధ్య కొత్త చిచ్చు ఏర్పడింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో సిపిఐ ఎమ్. పొత్తుకోసం ప్రయత్నిస్తోందని సిపిఐ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న మతతత్వ వ్యతిరేక సదస్సుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను పిలవడంపై రాష్ట్ర సిపిఐ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. డిల్లీలో సిపిఐ, సిపిఎం , సమాజ్ వాది వంటి పార్టీలు ఒక సదస్సును నిర్వహిస్తున్నాయి మామూలుగా అయితే టిడిపిని పిలిచేవారు.కాని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మోడీ చెంతకు వెళ్లడంతో ఆయనను వదలిపెట్టారు. అదే సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఆహ్వానించారు.జాతీయ స్థాయిలో మూడో ప్రంట్ ఏర్పాటుకోసం సన్నాహకంగా ఈ సదస్సు జరుగుతోందని భావిస్తున్నారు. అంతేకాక జాతీయ స్థాయిలో సిపిఎం నేతలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో ఇప్పటికే అవగాహనకు వచ్చారని నమ్ముతున్నారు. అదే సమయంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మాత్రం వామపక్షాల పొత్తు గురించి మాట్లాడుతూ డ్రామా ఆడుతున్నారని సిపిఐ నాయకులు విమర్శిస్తున్నారు. సిపిఐ జాతీయ నాయకులతో సదస్సుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఎలా పిలుస్తారని అబ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ దీనిపై బహిరంగంగానే సిపిఎం ను విమర్శించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బహిరంగంగానే చెప్పాలని, లోపల ఒకటి, బయట ఒకటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సిపిఎం ఇంకా స్పందించలేదు. సిపిఐ విబజనకు అనుకూలంగా ఉండగా సిపిఎం , వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు సమైక్యం కోరుతున్నాయి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను అవినీతి పార్టీగా సిపిఐ విమర్శిస్తోంది.అంతేకాక సిపిఐకి ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. టిడిపి తో పొత్తు కుదిరే పరిస్థితి లేక, అలాగే టిఆర్ఎస్ వారు పట్టించుకోక ఒంటరి యానం చేయవలసి వస్తుందన్న సందేహం వారిలో ఉంది.దీంతో వామపక్షాలుగా సిపిఎం వైఖరిని బహిర్గతం చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.నిజంగానే సిపిఎం కనుక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అది వామపక్షాల మధ్య అగాధం మరింత పెరుగుతుందని వీరు అంటున్నారు.దీనిపై సిపిఎం నేత రాఘవులు కూడా మరింత ఘాటుగా ధ్వజమెత్తారు,నారాయణ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు.నిజంగా ఆ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందో,లేదో కాని ఇప్పటికైతే వామపక్షాల మధ్య తగాదాకు అది మూలం అవుతోంది.

kommineni
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger