సినిమా రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌

Friday, January 31, 2014

రివ్యూ: హార్ట్‌ ఎటాక్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
తారాగణం: నితిన్‌, అదా శర్మ, అజాజ్‌ ఖాన్‌, నికోల్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: అమోల్‌ రాథోడ్‌
కథ, మాటలు, కథనం, నిర్మాత దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ: జనవరి 31, 2014
- See more at: http://telugu.greatandhra.com/movies/reviews/review-heart-attack-50063.html#sthash.3DI4ZsWi.dpuf
Continue Reading | comments

అందరిని పరుగు పెట్టిస్తాం

డిల్లీలో పార్లమెంటు సబ్యులను పరుగు పెట్టించడానికి విశాఖపట్నం లో సమైక్యపరుగు నిర్వహించామని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు డిల్లీలో జరిగే ఛలో డిల్లీ ఆందోళనకు అందరూ కలిసిరావాలని ఆయనపిలుపు ఇచ్చారు. పిబ్రవరి ఇరవై ఒక్కటిన పార్లమెంటు సమావేశాల చివరి రోజు అని ,ఈలోగా సమైక్య రాష్ట్రం కోసం మనం అప్రమత్తంగా ఉండి, ఆ రోజు విజయోత్సవం జరుపుకోవచ్చని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Continue Reading | comments

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..

చేతులు కట్టి.. గోచీలు పెట్టి..చెప్పులతో కొట్టి..
కొప్పవరం (అనపర్తి), న్యూస్‌లైన్ :భర్త, ఇద్దరు పిల్లల ఎదుటే ప్రయాణికురాలిని వికృత చేష్టలతో వేధించి, లైంగికదాడికి యత్నించిన ఆటోడ్రైవర్లను గ్రామస్తులు చెప్పులతో కొట్టి గుణపాఠం చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు గత 26న క్రైస్తవ సభలకు గుంటూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం విజయవాడలో కాకినాడ పాస్ట్ పాసింజర్ ఎక్కి రాత్రి  10.30కి అనపర్తి వచ్చారు. 
 
 అక్కడినుంచి కొప్పవరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద దుప్పలపూడికి చెందిన ఆటోడ్రైవర్ కర్రి గంగిరెడ్డితో బేరం కుదుర్చుకున్నారు. రాజమండ్రి క్వారీ ఏరియాకి చెందిన మరో డ్రైవర్ చిట్టూరి శివాజీని వెంటబెట్టుకుని గంగిరెడ్డి తన ఆటోలో వీరిని తీసుకుని బయలుదేరాడు. ఆటోను వారు నేరుగా కాకుండా అనపర్తి శివారు కొత్తూరు శ్మశాన వాటిక మీదుగా తీసుకువెళ్లారు. ఆటోను శివాజీ నడుపుతూ ఉండగా, గంగిరెడ్డి పక్కనే కూర్చుని వెనుకనున్న మహిళతో వికృతచేష్టలు ప్రారంభించాడు. ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. శ్మశానవాటిక వద్ద ఆటో ఆపిన డ్రైవర్లు ఆమె చేయి పట్టుకుని లాగబోయారు.
 
 దీంతో భార్యాభర్తలు భయంతో బిక్కుమంటూ ఆటోలోనే కూర్చునిపోయారు. పరిస్థితి దిగజారుతున్నా అర్ధరాత్రి కావడం, పక్కనే బిడ్డలు ఉండడంతో భర్త వారిని ఎదిరించలేదు. డ్రైవర్లకు అనుమానం రాకుండా సెల్ ఫోన్‌లో బంధు మిత్రులకు కాల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈలోగా శ్మశానవాటికకు దాపునే ఉన్న కెనాల్ రోడ్లో వాహన సంచారం కనిపించడంతో అక్కడ అనుకూలంగా లేదనుకున్న డ్రైవర్లు ఆటోను ముం దుకు తీసుకువెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గంగిరెడ్డి, శివాజీ బాధితురాలి భర్తను దారి గురించి అడిగారు. లక్ష్మీనర్సాపురంలో తాను పనిచేసే రైసుమిల్లు ఉండడంతో అటువైపు ఆటోను తరలించాలని భావించిన భర్త అటు జనసంచారం ఉండదని వారితో చెప్పాడు. దీంతో డ్రైవర్లు ఆటోను అటే మళ్లించారు. 
 
 రైసుమిల్లు దాటిన తర్వాత ఒక నిర్జన ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్లు కిందికి దిగి తమ ప్లాన్ అమలుపై మాట్లాడుకుంటుండగా, భర్త ఫోన్ ద్వారా తన స్నేహితునికి పరిస్థితి తెలిపాడు. ఈలోగా మరో ఇద్దరు అతడికి ఫోన్ చేశారు. వారికి చోటు చెప్పి వెంటనే రమ్మన్నాడు. దీంతో వారందరూ హుటాహుటిన బయలుదేరి ఆటో ఉన్న ప్రాంతానికి వచ్చారు. డ్రైవర్లు ఇద్దరినీ వారు కొప్పవరం లాక్కెళ్లి బాధితుల ఇంటికి చేరువలో స్తంభాలకు కట్టేశారు. వారి బట్టలు ఊడదీయించి గోచీలు పెట్టించారు. అర్ధరాత్రి ఈ సంగతి గ్రా మంలో దావానంలా వ్యాపించడంతో అంద రూ అక్కడకు చేరుకున్నారు. సాటి మహిళకు జరిగిన అవమానంపై కోపోద్రిక్తులైన మహిళలు గంగిరెడ్డి, శివాజీలను చెప్పులతో చావగొట్టారు. సమాచారం అందుకున్న అనపర్తి పోలీసులు గురువారం ఉదయం వారిద్దరినీ పోలీసు స్టే షన్‌కు
 తరలించారు.

Sakshi
Continue Reading | comments

ఆంధ్రజ్యోతి- రఘురామరాజు కధనంలో అవాస్తవాలు


వైసీపీకి గుడ్‌బై చెబుతున్నాఅంటూ రఘురామరాజు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే అవాస్తవాలు ఉన్నాయని అనుకుంటున్నారు.పార్టీని బలోపేతం చేసిన వాళ్లకే దిక్కులేదు అన్నప్పుడు మీ వర్గంలోని కొత్తవారికి టిక్కెట్లు ఎలా అడిగారు?

బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం ,జగన్ విభజనవాది అయితే తెలంగాణ బిల్లు కి మద్ధతు ఇస్తున్న బి‌జే‌పి ఏంటి?

రాష్ట్ర విభజన జరగదని, కేసు ద్వారా తాను ఆపేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జగన్‌కు చెబుతుంటే ఆయన ఒప్పుకోవడం లేదన్నారు రాజు . 
కోర్ట్లు ఏమి తీర్పు ఇస్తాయో మీరేలా నిర్ధారిస్తారు?న్యాయ వ్యవస్థ మీద అంతా చులకనా? జగన్ మీరు చెప్పేది ఎందుకు నమ్మాలి?

"అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లాను. ఆ సమయంలో జగన్ అక్కడే ఉన్నారు. నేను నమస్కారం పెడితే ఆయన స్పందించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నన్ను తక్కువ చేశారో.. లేక ఆయనకు సంస్కారం లేదో తెలియాలి'' అని రాజు మండిపడ్డారు. 

మనిషి చావు అప్పుడు కూడా నమస్కారాలు ఆశిస్తే మీరేమీ కోరుకుంటున్నట్లు?


రఘురామ కృష్ణంరాజు పార్టీ నుంచి వెళ్లిపోతారని స్పష్టమయ్యాక.. ఆయనపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలకు పాల్పడింది.  బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు జగన్ ప్రకటించుకోవడం గమనార్హం.
ముందే అర్ధం అయినప్పుడు పార్టీ బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం బాధగా ఉంది అందం ఎందుకు?

వైసీపీకి రఘురామకృష్ణంరాజు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ ఈనెల 14న 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. ముందుగానే లీకులీచ్చారా?


Continue Reading | comments

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు
సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు.
 
 
ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు.
 
 కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు.
Continue Reading | comments

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్

ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
బెంగళూరు : దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు.  అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్ కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్ మెంట్ లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు.

తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్ ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్ తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు.

ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.
Continue Reading | comments

సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక

‘కోడ్స్’తో కొడతారు!
  • మహారాష్ట్రలోని ఆటో, క్యాబ్ డ్రైవర్ల ప్లానింగ్   
  •  సంకేత పదాలతో ‘టార్గెట్స్’ ఎంపిక
  •  గుర్తించకుంటే దుండగుల బారిన పడ్డట్టే!  
  •  అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి
  •   ఒంటరిగా, తొలిసారి వెళ్లేవాళ్లు జాగ్రత్త: పోలీసుల సూచన
  సాక్షి, సిటీబ్యూరో: కొత్త ప్రదేశానికి వెళ్లాలంటేనే ఒక విధమైన బెరుకు. అక్కడి భాష, యాస ఇతరత్రా అన్నీ కొత్తగానే ఉంటాయి. ఒకవేళ మీరు మహారాష్ట్రలోని పట్టణాలకు తొలిసారి వెళ్తున్నా, అక్కడి క్యాబ్/ఆటోల్లో ఎక్కాలన్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ‘అక్కడి బస్సు, రైల్వే స్టేషన్లలో దిగగానే మీ చుట్టూ మూగిన డ్రైవర్ల నోటి వెంట ‘బెటర్’, ‘మాంగ్లో’, ‘జీపీఎల్’ వంటి కొత్త పదాలు వినిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వాహనాల్లోకి ఒంటరిగా ఎక్కకండి. సదరు డ్రైవర్లు నిలువు దోపిడీకో, మోసగించడానికో పథకం పన్నారని గుర్తుంచుకోండి. మహిళలు, యువతులు మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఒంటరిగా మహారాష్ట్రలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలీ ‘కోడ్స్’ ఏమిటి? అవి ఎందుకు?.. చదవండి మీకే తెలుస్తుంది.

అనూహ్య కేసు దర్యాప్తులో వెలుగులోకి..

 ముంబైలోని టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మచిలీపట్నం వాసి అనూహ్య అక్కడి కుందూర్ మార్గ్-భాందూప్ మధ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 5న, ఉదయం 4.55 గంటలకు కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్‌టీటీ) స్టేషన్‌లో రైలు దిగిన ఆమె ఆ తరవాత అదృశ్యమైంది. కొన్ని రోజుల తరవాత ఆమె మృతదేహం బయటపడింది.
 
ఈ ఘాతుకం ఎల్‌టీటీ పరిసరాల్లో ఉండే ఆటో/క్యాబ్ డ్రైవర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై క్రైమ్‌బ్రాంచ్ అధికారుల దర్యాప్తులో ‘కోడింగ్’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంకేత పదాల ద్వారా ప్రయాణికులకు అర్థం కాకుండా ఒకరితో మరొకరు సంప్రదించుకుంటున్న డ్రైవర్లు టార్గెట్స్‌ను ఎంపిక చేసుకుని పంజా విసురుతున్నారని గుర్తించామని అధికారులు చెబుతున్నారు.
 
 ఇలా చేయడం ఉత్తమం
 ఈ తరహా పదాలు, ముఠాలు మహారాష్ట్రలో చాలా ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణ సందర్భంలో వారికి ఎదురు తిరిగినా, ప్రతిఘటించినా దాడులకు వెనుకాడరు. ఒంటరిగా, తొలిసారి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
 
 కొత్తగా, ఒంటరిగా ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు వాహనాలను అద్దెకు తీసుకోరాదు. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి
 
 వీలున్నంత వరకు ప్రీపెయిడ్ సర్వీస్‌ను వినియోగించుకోవాలి. ఎక్కే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలను బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేసి చెప్పాలి. ఇది డ్రైవర్‌కు తెలిసేలా చేయాలి
 
 ప్రీపెయిడ్ సేవలు అందుబాటులో లేకుంటే తోటి ప్రయాణికుల్ని సంప్రదించి, వారితో కలిసే వాహనంలో ప్రయాణించాలి. అలాకాని పక్షంలో వాహనాన్ని మాట్లాడుకునేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలి
 
 అక్కడకు వెళ్లగానే రిసీవ్ చేసుకునేందుకు అక్కడ నివసిస్తున్న బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల్ని రమ్మని కోరాలి. మహిళలు/యువతులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
 
 బెటర్
 ప్లాట్‌ఫామ్ వద్ద రైలు ఆగగానే అప్పటికే అక్కడకు చేరుకునే ‘డ్రైవర్ ముఠా’ సభ్యుడు ఒంటరిగా రైలు దిగుతున్న, ముఖ్యంగా మహిళలు, యువతుల్ని గుర్తిస్తాడు. వారు బయటకొచ్చి ఆటో/క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, వారు ఒంటరిగా వచ్చారని తెలిపేందుకు ముఠా సభ్యుడు మిగిలిన వారికి ‘బెటర్’ అంటూ సమాచారమిచ్చి టార్గెట్ చేయాలని సూచిస్తాడు.
 
 మాంగ్‌లో
 ప్రయాణికుల ఆహార్యం, ప్రవర్తనను బట్టి వారికి మహారాష్ట్రతో పరిచయం ఉందా? లేదా? అనేది ఇట్టే గుర్తుపట్టేస్తారు. తొలిసారి వచ్చిన వారైతే మోసం చేయడం తేలిక కావడంతో ఆ విషయాన్ని ఇతర ముఠా సభ్యులకు తెలిపేందుకు వారికి వినిపించేలా ‘మాంగ్‌లో’ పదాన్ని ప్రయోగిస్తాడు.
 
 జీపీఎల్
 మార్గమధ్యంలో మోసం చేయడానికి అనువుగా తయారు చేసుకున్న పదం ‘జీపీఎల్’. ప్రయాణికుడు ప్రీపెయిడ్ వాహనం తీసుకున్నా, ముందే కిరాయి చెల్లించినా అతడిని ఎక్కించుకునే ముఠా సభ్యుడు మరొకరితో ‘జీపీఎల్’ అంటాడు. అంటే తన వాహనాన్ని అనుసరించాలని అర్థం. మధ్యలో బ్రేక్‌డౌన్ పేరుతో ప్రయాణికుడిని దించేసిన తరువాత ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తూ ఎక్కించుకోమని అర్థం.
 
Continue Reading | comments

జగన్ కు కొత్త ఓట్లు రావు, పడేవి పక్కకు పోవు!

వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్  సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి  కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది. 
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే  మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు! 
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు  పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే! 
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి? 
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
Continue Reading | comments

కాంగ్రెస్ లో టిఆర్ఎస్ విలీనం తప్పదా!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పదా?ఎఐసిసి ప్రదాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి(ని విలీనం చేయాల్సిందేనని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం విశేషం. తెలంగాణ బి్ల్లుపై శాసనసభ లో చర్చ పూర్తి అయ్యాక ఆయన ఈ విషయం చెప్పడం విశేషం.ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నూటికి నూరుశాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని, బిజెపి పూర్తిగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
Continue Reading | comments

12 యేళ్లకు అవకాశమొస్తే దాన్నీ తన్నుకుపోయాడు!

Thursday, January 30, 2014

తెలంగాణ రాష్ట్ర సమితి ఆ మధ్య పుష్కర వేడుకలను పూర్తి చేసుకొంది. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ తో ఆవిర్భవించిన టీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే టైమ్ కాస్తంత కలిసి వస్తోంది. కాంగ్రెస్ రాజకీయాల పుణ్యామా అని తెలంగాణ రాష్ట్ర సమితి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ సమయంలో టీఆర్ఎస్ కు సంబంధించి కొన్ని ఫాంటసీలు కూడా వాస్తవంలో నిజం అవుతున్నాయి. 
అలాంటి ఫాంటసీల్లో ముఖ్యమైనది రాజ్యసభ సభ్యత్వం. ఇప్పుడు తొలిసారి రాజ్యసభలో టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వ్యక్తి తన్నుకుపోతున్నాడని గులాబీ కండువాలు ఫీలవుతున్నాయి. తెరాస తరపున కే కేశవరావు రాజ్యసభకు నామినేషన్ వేశాడు. ఈయన కు తెరాస సభ్యత్వం ఉంది కదా, ఈయన కాంగ్రెస్ వాడు ఎలా అవుతాడు? అని అంటే.. ఆయన నిన్నలా మొన్న టీఆర్ఎస్ లో చేరాడని, దశాబ్ధకాలంగా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ ను  అనేక మాటలు అని ఇప్పుడు టీఆర్ఎస్ చేరిన ఆరు నెలల్లోనే రాజ్యసభకు వెళ్తున్నాడనేది గులాబీ దళ నాయకుల భావన. 
అది కూడా ఇది ఊరికే లభిస్తున్న అవకాశం కాదు. 12 సంవత్సరాల కు దక్కుతున్న అవకాశం. ఇలాంటి అవకాశాన్ని పార్టీ సిద్ధాంత కర్తల్లో ఎవరో ఒకరికి ఇస్తే బావుంటుండేది కానీ, ఇలా నిన్నలా మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి ఇచ్చేస్తే ఎలా? అని టీఆర్ఎస్ నాయకులు గొణుక్కొంటున్నారు. అయితే ఇది అధినేత స్థాయిలో జరిగిపోయిన నిర్ణయం కాబట్టి ఇక చేయగలిగిందేమీ లేదన్న నిరాసక్తత కూడా కనిపిస్తోంది వారిలో. అయితే వాస్తవానికి ఇప్పుడు కూడా టీఆర్ఎస్   రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకొనేది  సొంత శక్తితో కాదు కదా... కాంగ్రెస్ సభ్యుల సహకారం అందిస్తేనే కేకే గెలవగలడు. ఈ లెక్కన సగం కాంగ్రెస్ బలం, సగం టీఆర్ ఎస్ బలం.. అభ్యర్థి కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి న్యాయం జరుగుతున్నట్టే! 
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/12-samvatsaralaku-avakasam-vasthe-danni-50048.html#sthash.wL3f2IXs.dpuf
Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!




కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Continue Reading | comments

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నరసాపురం లోక్ సభ నియోజకవర్గ సమన్వయ కర్త రఘురామకృష్ణం రాజును ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వకర్తల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేసినట్లు వై.కాంగ్రెస్ ప్రకటించింది. కాగా బిజెపి నేత వెంకయ్య నాయుడు ను రఘురామరాజు తన ఇంటికి ఆహ్వానించి, బిజెపిలో చేరే విషయమై చర్చించారని కదనాలు రావడంతో పార్టీ ఈ చర్య తీసుకుంది
Continue Reading | comments

కెవిపి కూడా విలపించారా

శాసనసభ ఆవరణలో ఇద్దరు పెద్ద నేతలు విలపించారంటూ వచ్చిన కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ,సిట్టింగ్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ఉన్నారన్న కధనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.టిడిపి లో రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు శాసనసభ ప్రాంగణంలో కంటతడిపెట్టి రోదించారని ఇప్పటికే కధనం రాగా,తాజాగా కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావు కూడా విలపించారని వార్త రావడం విస్మయం కలిగిస్తుంది.మంత్రి గంటా చాంబర్ లో తిరుగుబాటు అభ్యర్ధులు చైతన్య రాజు, గంటా శ్రీనివాసరావులను తప్పించడం కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని మంత్రి గంటాను ప్రశ్నిస్తూ కేవీపీ బిగ్గరగా రోదించారని మీడియాలో కధనం వచ్చింది.దీంతో అక్కడ ఉన్న నేతలంతా విస్తుపోయారు.తాను విభజనవాదినా అని ఆయన ప్రశ్నించారట. ఎన్నో డక్కామక్కీలు తిన్న కెవిపి కూడా నిజంగా అలా చేసి ఉంటారా..

తాను రోదించానంటూ ఒక పత్రికలో వచ్చిన కధనాలపై సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. తనకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ శాసనసబలో ముప్పైఏడు మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోలేకపోతే ఇక రాజకీయాలలో ఉండి లాభం ఏమిటి అని ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే.అనేకమదికి టిక్కెట్లు ఇప్పించడంలో, ప్రభుత్వం నడపడంలో కీలక పాత్ర పోషించిన కెవిపి రాజ్యసభ ఎన్నికలలో కొందరు తిరుగుబాటుదార్లు పోటీచేస్తున్న సందర్భంలో చర్చలలో కెవిపి రోదించారని కదనం వచ్చింది. అది నిజమా అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానిపై కెవిపి వివరణ ఇవ్వడం సరిగానే ఉంది.
Kommineni
Continue Reading | comments

రఘురాజు విభజన వాద బిజెపిలో ఎలా చేరతారో

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని బావిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు ఇంటికి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు వెళ్లడం చర్చనీయాంశం అయింది. రాజు బిజెపిలో చేరి నరసాపురంలో పోటీచేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. కొందరు శాసనసభ అభ్యర్దుల విషయంలో వచ్చిన విబేదాలతో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దూరం అవుతున్నారని అంటున్నారు.అయితే వీర సమైక్యవాదనని, సుప్రింకోర్టులో కూడా విభజనకు వ్యతిరేకంగా పోరాడతానని చెబుతున్న రాజు విభజనవాద పార్టీ అయిన బిజెపిలో ఎలా చేరతారబ్బా!ఇదే రాజకీయ విచిత్రం అంటే
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger