Home » , , , » కెవిపి కూడా విలపించారా

కెవిపి కూడా విలపించారా

శాసనసభ ఆవరణలో ఇద్దరు పెద్ద నేతలు విలపించారంటూ వచ్చిన కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ,సిట్టింగ్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ఉన్నారన్న కధనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.టిడిపి లో రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు శాసనసభ ప్రాంగణంలో కంటతడిపెట్టి రోదించారని ఇప్పటికే కధనం రాగా,తాజాగా కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావు కూడా విలపించారని వార్త రావడం విస్మయం కలిగిస్తుంది.మంత్రి గంటా చాంబర్ లో తిరుగుబాటు అభ్యర్ధులు చైతన్య రాజు, గంటా శ్రీనివాసరావులను తప్పించడం కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని మంత్రి గంటాను ప్రశ్నిస్తూ కేవీపీ బిగ్గరగా రోదించారని మీడియాలో కధనం వచ్చింది.దీంతో అక్కడ ఉన్న నేతలంతా విస్తుపోయారు.తాను విభజనవాదినా అని ఆయన ప్రశ్నించారట. ఎన్నో డక్కామక్కీలు తిన్న కెవిపి కూడా నిజంగా అలా చేసి ఉంటారా..

తాను రోదించానంటూ ఒక పత్రికలో వచ్చిన కధనాలపై సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. తనకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ శాసనసబలో ముప్పైఏడు మంది ఎమ్మెల్యేలను సమకూర్చుకోలేకపోతే ఇక రాజకీయాలలో ఉండి లాభం ఏమిటి అని ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే.అనేకమదికి టిక్కెట్లు ఇప్పించడంలో, ప్రభుత్వం నడపడంలో కీలక పాత్ర పోషించిన కెవిపి రాజ్యసభ ఎన్నికలలో కొందరు తిరుగుబాటుదార్లు పోటీచేస్తున్న సందర్భంలో చర్చలలో కెవిపి రోదించారని కదనం వచ్చింది. అది నిజమా అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానిపై కెవిపి వివరణ ఇవ్వడం సరిగానే ఉంది.
Kommineni
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger