Home » , , , , » పొలారిస్ ఇండియన్ బ్రాండ్ మోటార్‌ బైక్స్

పొలారిస్ ఇండియన్ బ్రాండ్ మోటార్‌ బైక్స్

పొలారిస్.. ‘ఇండియన్’ సూపర్ బైక్స్
 న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన పొలారిస్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్  కింద మూడు మోడళ్లను అందిస్తోంది.

చీఫ్ మోడల్‌లో క్లాసిక్(ధర రూ. 26.5 లక్షలు), వింటేజ్(ధర రూ. 29.5 లక్షలు), చీఫ్‌టైన్(ధర రూ. 33 లక్షలు) బైక్‌లను అందిస్తున్నామని పొలారిస్ ఇండియా  ఎండీ పంకజ్ దుబే చెప్పారు.  ఈ బైక్‌లను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని తెలిపారు. ఈ మూడు బైక్‌లకు బుకింగ్స్ ప్రారంభించామని, మార్చి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు.

 బైక్స్ ప్రత్యేకతలు ఇవీ...
   వి-ట్విన్ ధండర్ స్ట్రోక్ 111 ఇంజిన్(1,811సీసీ)తో రూపొందిన ఈ సూపర్ బైక్‌ల్లో  6 గేర్లు,  ఏబీఎస్, క్రూయిస్ కంట్రోల్, కీలెస్ ఇగ్నీషన్, అల్యూమినియం ఫ్రేమ్ వంటి ఫీచర్లున్నాయి.

   ఇక క్లాసిక్ బైక్‌లో టెలిస్కోపిక్ కార్‌ట్రిడ్జ్ ఫోర్క్ ఫీచర్ ఉండగా, వింటేజ్‌లో లెక్సన్ విండ్ షీల్డ్ ఫీచరుంది.  

   చీఫ్‌టైన్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పవర్డ్ విండ్‌షీల్డ్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్‌తో 100 వాట్స్ స్టీరియో సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

   ఇండియన్ అనేది అమెరికాలో అత్యంత పురాతనమైన మోటార్‌సైకిల్ బ్రాండ్.
   ఇక్కడ హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్‌తో పోటీపడనుంది.
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger