Showing posts with label latest. Show all posts
Showing posts with label latest. Show all posts

వైసీపీ నుండి వెళ్లిపోవట్లేదు ...

Wednesday, January 29, 2014

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెబుతున్నారంటూ , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వున్నారంటూ ఊహాగానాలు విన్పించాయి. ప్రధానంగా తోట చంద్రశేఖర్‌, బొడ్డు భాస్కర రామారావు వైసీపీనీ వీడనున్నట్లు వార్తలు రాగా, వారిద్దరూ ఆ వార్తల్ని కొట్టి పారేశారు. తాము వైసీపీని వీడటంలేదనీ, వైసీపీ ఎదుగుదల చూసి, ఓర్వలేనివారే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తోట, బొడ్డు ఆరోపించారు. కాగా, పశ్చిమగోదావరికి జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖ నేత రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తోన్న వార్తల్ని ఇప్పటిదాకా ఖండించలేదు.
ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు విన్పిస్తోన్న విషయం తెల్సిందే.
Continue Reading | comments

చోరీ సొత్తు అమ్మలేక

చోరీ సొత్తు అమ్మలేక లొంగిపోయారు
హైదరాబాద్: తనిష్క్ షోరూమ్‌లో దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు గంటినపాటి ఆనంద్ ను పోలీసులు ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మొదటి నిందితుడు భూమన కిరణ్ కుమార్ ను ఇంతకుముందే లొంగిపోయాడు. వీరిద్దరూ పథకం ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.

మూడుసార్లు రెక్కీ నిర్వహించి దొంగతనానికి పథకం నిర్వహించారని చెప్పారు. కిరణ్ ప్రణాళిక రచించగా ఆనంద్ అమలు చేశాడని వెల్లడించారు. స్కూ డ్రైవర్ పై చేతి రుమాలు పెట్టి సుత్తితో కొట్టి గోడ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారని తెలిపారు. కిరణ్ బయట కాపలాగా ఉండగా ఆనంద్ దుకాణం లోపలకు వెళ్లి దొంగతనం చేశాడని చెప్పారు. మూడు బ్యాగుల్లో నగలు ఎత్తుకు పోయారని చెప్పారు. అయితే  సంఘటనా స్థలంలో ఆధారాలు లభ్యం కాకుండా జాగ్రత్త పడ్డారని వెల్లడించారు. ఐరీష్ కనబడకుండా కళ్లద్దాలు, తల వెంట్రుకలు ఘటనా స్థలంలో పడకుండా జెల్ రాసుకున్నారని చెప్పారు. పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా కారప్పొడి చల్లారని తెలిపారు.

చోరీ సొత్తు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భయపడిపోయి కిరణ్ కుమార్ లొంగిపోయాడని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్టుకథ అల్లాడని పేర్కొన్నారు. వేరే వాళ్ల ప్రమేయం ప్రత్యక్షంగాని, పరోక్షంగాని కనబడలేదన్నారు.

sakshi
Continue Reading | comments

2013.. ఓ ప్రేమ కథ

2013 జనవరి, అమెరికాలోని కాలిఫోర్నియా..
 ఆడ్రియానా పెరాల్. ఆమె లైఫ్ స్టైలే వేరు. బికినీలు, హైహీల్స్..
 రోజూ పార్టీలు, వైన్, విస్కీ.. తాగి తూగడం.. పొద్దున్నే జిమ్.. అంతా హైఫై.
 సీన్.. కట్ చేస్తే...

 
 2014 జనవరి, హర్యానాలోని పాప్‌రాన్ గ్రామం..
 ఆడ్రియానా పెరాల్. చుడీదార్, నెత్తిన కొంగు, నుదుటన సింధూరం.. పిడకల పొయ్యి మీద వంట వండుతోంది.. గేదెలను పీచుతో తోముతోంది.. అంట్లు తోముతోంది.. ఇళ్లూడుస్తోంది.. ఇక్కడ పార్టీలు లేవు. టాయిలెట్‌కు పోవాలన్నా బయటకు వెళ్లాల్సిందే.. షవర్ సంగతి సరేసరి.. స్నానానికి గేదెలకు, మనుషులకు ఒకటే బకెట్!
 
 ఏమిటీ మాయ.. అవును. ప్రేమ చేసిన మాయ. ఆడ్రియానా ప్రేమలో పడింది. అన్నీ వదిలొచ్చేసింది.. సంతోషంగా.. చిత్రంలో కనిపిస్తున్న ఆడ్రియానా, ముకేష్‌కుమార్‌ల ప్రేమ కథలోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఆడ్రియానా(40)కు ముకేష్(24) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు చాట్ చేసుకున్నారు. ఒక్కరోజు హఠాత్తుగా ముకేష్ ఆడ్రియానాకు ఫోన్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆడ్రియానా నవ్వేసింది. ఏమిటీ పిచ్చిమాటలు నీ వయసెంత.. నా వయసెంత అంది. నాకు నీ వయసు కూతురుందని చెప్పింది. ముకేష్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా ఇదే తీరు. ఆడ్రియానా ఆలోచనలో పడింది. తర్వాత ఇద్దరూ ఇన్ లవ్. ఆడ్రియానా ముకేష్ కోసం కాలిఫోర్నియాను వదిలి భారత్‌కు వచ్చేద్దామని గతేడాది ఆగస్టులో డిసైడైంది. ఇంట్లో వాళ్లు వారించారు.
 
  కూతురైతే.. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని చెప్పింది. ముకేష్ ఆన్‌లైన్ మోసగాడని వారించింది. ఆడ్రియానా ముకేష్‌ను నమ్మింది. వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో దిగగానే ముకేష్. నేరుగా పాప్‌రాన్ గ్రామానికి.. నవంబర్‌లో సంప్రదాయరీతిలో వివాహం. అమెరికా లైఫ్‌స్టైల్‌కి.. ఇక్కడి జీవనశైలికి ఎంతో తేడా. అయితేనేం.. అలవాటుపడిపోయింది.. హిందీ మాట్లాడటం నేర్చుకుంటోంది. బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడే భర్తకు ఇంగ్లిష్ నేర్పిస్తోంది.  సాగులో సాయమూ చేస్తోంది. ఇక ఆడ్రియానా అత్తగారైతే.. ఆమెపై ప్రశంసలే ప్రశంసలు.
Continue Reading | comments

ఎన్‌టి‌ఆర్ పాత పత్రికా ఫోటోలతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై వై యస్ ఆర్ అభిమానుల ప్రచారం

Monday, January 27, 2014












 





































source: facebook

Continue Reading | comments

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ బయటకు ..

పోలిట్ బ్యూరో సమావేశం నుంచి వెళ్లిపోయిన హరికృష్ణనందమూరి హరికృష్ణ
హైదరాబాద్: టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నుంచి ఆ పార్టీ మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు  ఆ పార్టీ పోలిట్ బ్యూరో ఈ రోజు సమావేశమైంది.  తాను రాజ్యసభ టిక్కెట్ రేసులో ఉన్నట్లు హరికృష్ణ తెలిపారు.  తాను టిక్కెట్ ఆశిస్తున్నందున సమావేశంలో ఉండటం మంచిదికాదని బయటకు వచ్చినట్లు చెప్పారు.

సమైక్య రాష్ట్రం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు హరికృష్ణ చెప్పారు.
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger