Showing posts with label breaking. Show all posts
Showing posts with label breaking. Show all posts

రఘురామకృష్ణంరాజు తర్వాత స్టెప్ ఏమిటి!

Thursday, January 30, 2014




కనుమూరు రఘురామకృష్ణంరాజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైన విషయం విదితమే. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ జగన్‌ కుడి భుజంగానూ పేరొందారు.

ఏమయ్యిందో, ఆయన అనూహ్యంగా రివర్స్‌ గేర్‌ వేశారు. బీజేపీతో మంతనాలు షురూ చేశారు. బీజేపీ నుంచి టిక్కెట్‌ కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని రఘురామరాజు గురించి గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఆయన ఇంట్లో బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు దర్శనమివ్వడం వైసీపీ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది.

రఘురామకృష్ణంరాజు వైసీపీని వీడనున్నారంటూ కొన్ని రోజుల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ఆయన ఆ గాసిప్స్‌ని ఖండించలేదు. ఈలోగా పార్టీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పించింది. తనను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫైర్‌ అయిన రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదనీ, జగన్‌ జైల్లో వున్నప్పుడు ఒకలా, బయటకు వచ్చాక ఇంకొకలా వ్యవహరిస్తున్నారనీ, సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్‌ అనీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

జగన్‌ ఏం చెప్పినా వినడానికి జనం గొర్రెలు కారంటూ రఘురామకృష్ణంరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్‌ జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపిన వైవీ సుబ్బారెడ్డినీ, నడిపించిన షర్మిలనూ ఆ తర్వాత పక్కన పడేశారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇక, రఘురామకృష్ణంరాజు ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడ్తున్నారు. పార్టీని వీడుతూ ఆరోపణలు చేయడం వింతేమీ కాదనీ, ఆయన ఆరోపణల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

.జగన్ మదం అణచడానికి తాను రాజకీయాలలో ఉంటానని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉంటూ సస్పెండైన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.జగన్ సమైక్యవాదం ముసుగులో ఉన్న విభజనవాది అని ఆయన ద్వజమెత్తారు.జగన్ ను ఎంత పెద్ద వారైనా సార్ అని పిలవాలట.. ఆయన మాత్రం ఎవరినైనా నువ్వు అని అంటారట అని కూడా రాజు ఆరోపించారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.



కాగా స్వార్థ ప్రయోజనాల కోసమే కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్టీని వీడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అని ఆరోపించారు. డబ్బు మదంతో వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని అన్నారు.

రఘురామ కృష్ణంరాజు అవకాశవాది అని నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాజకీయ అవకాశవాదంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి జగన్ అన్యాయం చేయరని అన్నారు. నరసాపురంలో ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రఘురామ కృష్ణంరాజు లాంటి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ పై ఆయన ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని టిక్కెట్లు ఇచ్చేది లేదని కృష్ణంరాజుకు జగన్ స్పష్టం చేశారని చెప్పారు. నిన్నటివరకు సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత జగన్ అంటూ ప్రశంసించిన ఆయన ఇప్పడు అవకాశవాదంతో తమ నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతల నుంచి రఘురామ కృష్ణంరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Continue Reading | comments

రాష్ట్రంలోని 294 స్థానాల్లో పోటీ

Monday, January 27, 2014

వచ్చే ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలోని 294 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వారసత్వ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. అబద్ధాల ఆటకట్టు, నిజాల నిద్రలేపు, సరికొత్త ఆయుధం పట్టు అన్న నినాదంతో పార్టీ ఎన్నికల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. భవిష్యత్తులో తన వారసులు రాజకీయాల్లోకి రారని, కార్యకర్తల నుంచి ఎదిగే నాయకులకే పార్టీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాజకీయాల్లో మార్పు, అవినీతికి వ్యతిరేకంగా 40 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేశానని, ఇక ముందు ఈ బాధ్యతను యువత భుజానికెత్తుకోవాల్సి
న అవసరం ఉందని జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. మర్యాద, మంచి రాజకీయాలు, మంచి పాలన నినాదమే లోక్‌సత్తా ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశాన్ని శాసించేది యువత, మహిళ ఓటర్లేనని, మార్పు వారి నుంచే రావాలని అన్నారు.
వివేచనతో సంక్షోభాన్ని పరిష్కరించుకుందాం: కటారి
తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వివేచనతో పరిష్కరించుకుందామని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలవారూ సంతృప్తి చెందేలా ఒక సమగ్ర, సానుకూల పరిష్కారాన్ని తాము ప్రజలముందు ఉంచామని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం అసహజమైన రీతిలో రుద్దుతున్న ఈ సంక్షోభాన్ని భావోద్వేగాలకు అతీతంగా, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గణతంత్ర వ్యవస్థ నిజమైన లక్ష్యాలకనుగుణంగా దేశాన్ని నడిపించడానికి ప్రజలు కలిసికట్టుగా ముందుకు నడవాలన్నారు.
Continue Reading | comments

కడప లో టిడిపి శ్రీకాంతరెడ్డి ఎంత ఖర్చు చేశారో!

Sunday, January 26, 2014

వచ్చే ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని టిడిపి మాజీ నేత, యువవేదిక,జనపాలన సంస్థ అదినేత పాలెం శ్రీకాంతరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడు కోట్లు, లోక్ సభ నియోజకవర్గానికి ఇరవై కోట్లు ఖర్చు చేయాలని నేతలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుతో నోటుకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. అవినీతి రాజకీయాలను అంతం చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్నికల్లో ధనస్వామ్యాన్ని అడ్డుకోవడంలో భాగంగానే జనపాలన పేరుతో సామాజిక రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశామన్నారు.అయితే తాను కడప లోక్ సభ కు టిడిపి పక్షాన పోటీచేసినప్పుడు ఎంత ఖర్చు అయింది?ఎలా నిధులు వచ్చాయి?దానివల్ల ఏమి జరిగింది?ఇతర పార్టీలు ఎలా ఖర్చు పెడుతున్నాయి? మొదలైనవాటిని స్వీయానుభవంతో చెబితే బాగుంటుంది కదా!
Continue Reading | comments

YS Jagan Samikya Sankaravam photos23 &24 jan 2014

Saturday, January 25, 2014






















Continue Reading | comments

గతంలో ఓ స్త్రీ రేపు రా...ఇప్పుడు బాబు ఇక రాకు

'గతంలో ఓ స్త్రీ రేపు రా...ఇప్పుడు బాబు ఇక రాకు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 'బ్రింగ్ బ్యాక్ బాబు' పేరుతో టీడీపీ కొత్త ప్రచారానికి తెరలేపిందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం భూమన మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుది రాక్షస పాలని అని.... తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న ఆయన ప్రజలకు ఏం చేశారని అధికారం కట్టబెట్టాలని ప్రశ్నించారు. 'గతంలో దెయ్యాలొస్తాయన్న భయంతో.... ఓ స్త్రీ రేపు రా...అని రాసుకునేవారు...ఇప్పుడు చంద్రబాబు నువ్వు ఇక రాకు' అనే పరిస్థితులు వచ్చాయని భూమన అన్నారు.

చంద్రబాబు దుష్టపాలన మళ్లీ రాకూడదని ప్రజలు పూజలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రూల్ 77, 78 కింద సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పట్టుబడుతోందని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే అంశాన్ని మరోసారి స్పీకర్ కు గుర్తు చేశామన్నారు. కాగా ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి....నిరసన తెలపటంతో స్పీకర్ సమావేశాలను 15 నిమిషాలు వాయిదా వేశారు.
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger