Home » , , , , , » విభజనపై పలుకని నారా లోకేష్ చిలుక

విభజనపై పలుకని నారా లోకేష్ చిలుక

విభజనపై పలుకని నారా లోకేష్ చిలుకహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ట్విట్టర్‌లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేయడంలో అందె వేసిన చేయిగా మారారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన విసిరిన విసుర్లు పలుమార్లు తీవ్ర దుమారం రేపాయి. కానీ ఆయన చిలుక ఎందుకో ఇటీవలి కాలంలో మూగబోయింది.
నారా లోకేష్ చివరి సారి జులై 22వ తేదీన ట్విట్టర్‌లో చేయి పెట్టారు. ఆ తర్వాత ఆయన పలుకులు వినిపించడం లేదు. రాష్ట్ర విభజనపై రాష్ట్రం రగిలిపోతుంటే ఆయన మౌనముద్ర దాల్చారు. ఆయన తండ్రి చంద్రబాబు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చారు. కానీ, తెలంగాణపై అంతగా స్పందించలేదు. ఆయన కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కానీ విభజనను ఆపలేమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకత్వం వహించే భవిష్యత్తు నాయకుడిగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్న నారా లోకేష్ ఈ విషయంపై మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెసు తీరుపై మండిపడుతూ ఆయన వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటే, పూర్తి మౌనముద్ర దాల్చారు. కాగా, చంద్రబాబు తీరుపై సీమాంధ్ర నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని వారు అంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం రాష్ట్రం చీలిపోవడం ఖాయమైనట్లు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చి, తెలంగాణలో కంటు కావడం ఎందుకని భావిస్తున్నారట.
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger