శాఖ మారిస్తే సరిపోతుందన్న కిరణ్
అరుునా అంగీకరించని హైకమాండ్గ
చివరకు సరేనన్న కాంగ్రెస్ అగ్రనేతలు
మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చమని ఆదేశం
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వేటు?
విపక్షాలకు అవకాశమివ్వకూడదన్న నిర్ణయం
కోర్టు తీర్పును బట్టి మిగతా వారిపై నిర్ణయం
జగన్ విషయంలో మరింత కఠినం
కిరణ్‌కు సోనియా, రాహుల్ దిశానిర్దేశం
కళంకిత మంత్రులపై వేటు తప్పేలా లేదు. అధిష్ఠానం ఆ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై వేటు పడేందుకు రంగం సిద్ధమయింది. వారిద్దరిపై వేటు వేయకుండా కిరణ్ చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ, అవినీతి ఆరోపణల విషయంలో అధిష్ఠానం దేశమంతా ఒకే విధానం అనుసరిస్తున్నందున కిరణ్ ఒత్తిడి ఫలించ లేదు. సీబీఐ చార్జిషీట్‌లో పేరు నమోదయి, కోర్టుల చుట్టు తిరుగుతున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఆదేశించింది. ముఖ్యమంత్రి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్‌గాంధీ, అహ్మద్‌పటేల్ ఈ మేరకు కిరణ్‌కు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అయితే, ఆ ఫైళ్లపై సంతకాలు చేసినందుకు మంత్రు లెవరూ లబ్థి చెందలేదని, కేవలం వైఎస్ కుటుంబం మాత్రమే లబ్థి పొందిందని కిరణ్ వివరించారు.
ప్రతిపక్షాల నుంచి ఇప్పటి నుంచే విమర్శలు ఎదురవుతూ, ఎల్లుండి రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతోంది.అదే సమయంలో రాష్ట్రంలో జగన్ పార్టీ దూకుడును నియంత్రించాలని ఆదేశించింది. చంచల్‌గూడ జైలు వైఎస్సార్ సీపీ కార్యాలయంగా మారిందని, అడ్డగోలుగా ములాఖాత్‌లు ఇస్తున్నారని, జగన్ జైలు నుంచే పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నారంటూ వీహీచ్, మధు యాష్కీ వంటి నేతలు చేసిన ఫిర్యాదులను అధిష్ఠానం ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, మరికొద్ది నెలల తర్వాత జగన్ పార్టీ కుప్పకూలిపోతుందని, ఇప్పటికే ఆ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని కిరణ్ వివరించారు. నిబంధల మేరకే వ్యవహరిస్తున్నామని జైళ్ల శాఖ అథికారులు చెప్పిన విషయాన్ని సీఎం వివరించారు.
source:సూర్య

0 comments:
Post a Comment