Showing posts with label technology. Show all posts
Showing posts with label technology. Show all posts

800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటరు (1000 ఎం.ఎల్.) పోసినట్లు

Thursday, January 30, 2014

గప్‌చిప్‌గా పెట్రోల్ కొట్టేస్తారు
‘చోరీ’ సాఫ్ట్‌వేర్‌తో రూ. 30 కోట్లకు చిల్లు
  మూడేళ్లుగా వాహనదారుల నిలువు దోపిడీ
  ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్‌వోటీ 
  ఐదుగురి అరెస్టు... ముగ్గురు పరారీ
 అసలే ధర పెంచేస్తూ చమురు సంస్థలు వేస్తున్న వరుస వాతలతో వాహనదారులు ఒకపక్క విలవిలలాడుతుంటే... వారినింకా నిలువు దోపిడీ చేసేయడానికి దొరికిన ఏ అవకాశాన్నీ కొందరు పెట్రోల్ బంకు నిర్వాహకులు వదలట్లేదు... ఇదే అదనుగా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ముందుకొచ్చింది ఓ ముఠా... 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటరు (1000 ఎం.ఎల్.) పోసినట్లు తెర (డిస్‌ప్లే)పై చూపించడం దీని ప్రత్యేకత... ఇంకేం మూడేళ్ల క్రితమే ఈ తరహా దోపిడీకి తెర లేచింది. వాహనదారుల జేబుకు చిల్లు పెట్టడం మొదలెట్టారు. ఇలా మన రాష్ట్రంలోనే దాదాపు రూ. 30 కోట్ల వరకు చల్లగా నొక్కేశారని అంచనా. ఈ నయా మోసానికి తెరలేపిన ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ మోసానికి పాల్పడ్డ పెట్రోల్ బంకు యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 
 రాష్ట్రంలో మూడేళ్లుగా దగా: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అఫ్జల్ బారీ (35), ఫైజల్ బారీ (38) సోదరుల కుటుంబం దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడింది. వారిద్దరూ ఐటీఐలో ఫిట్టర్ ఒకరు, ఎలక్ట్రానిక్స్ కోర్సును మరొకరు చదివారు. పెట్రోల్ బంక్‌లో మెకానిక్ అయిన తండ్రి మసూద్ వద్ద పంప్ మెకానిక్ నైపుణ్యాన్నీ సంపాదించారు.  ఆ సోదరులిద్దరూ హైదరాబాద్, విజయవాడల్లో పలు పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. విజయవాడలో పనిచేస్తున్నప్పుడే పెట్రోల్ పంప్ మెషిన్లను తయారు చేసే తోకీమ్ కంపెనీలో టెక్నిషియన్ కల్యాణ్ వారికి పరిచయమయ్యాడు. 
 
 - అఫ్జల్, ఫైజల్, కల్యాణ్ ముగ్గురూ కలసి రూ. 6 లక్షల చొప్పున ముట్టజెప్పి ఆరు కంపెనీలకు చెందిన మెషిన్ సాఫ్ట్‌వేర్‌లను దక్కించుకున్నారు. వాటి ఆధారంగా ప్రత్యేక చిప్‌లను తయారు చేశారు. 
 
 - ఆ చిప్‌లతో పెట్రోల్ వినియోగదారుల జేబులకు ఎలా చిల్లు పెట్టి భారీగా ఎలా డబ్బు సంపాదించవచ్చో వివరించి బంకు యజమానులను ఈ కుంభకోణంలోకి లాగారు. చిప్‌కు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకొనేవారు. 
 
 - ఆ చిప్‌తో పాటు, దాని రిమోట్‌నూ బంకు నిర్వాహకులకు ఇచ్చేవారు. ఈ ‘రిమోట్’తోనే వాహనదారులకు కుచ్చుటోపి వేస్తున్నారు. 
 
 - బంకులోని పెట్రోల్ మెషిన్‌లో దాని అసలు చిప్‌తో పాటు ఈ నకిలీ చిప్ కూడా ఉంటుంది. ఒకవేళ అధికారులు తనిఖీకొస్తే రిమోట్‌తో నకిలీ చిప్‌ను ఆఫ్ చేస్తారు. దీంతో ‘మోసం’ గుట్టు కనిపెట్టడం దాదాపు అసాధ్యం. 
 
 - గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడుగా కాకుండా కొనసాగుతోంది. మన రాష్ర్టంలో 75 పెట్రోల్ బంకుల్లో ఈ చిప్‌లు అమర్చారు. మరో 600 పెట్రోల్ బంకుల్లో అమర్చేందుకు నిందితులు రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
 - ఈ వ్యవహారంలో రాజమండ్రి నెహ్రూనగర్‌కు చెందిన షేక్ ముస్తాఫా, విజయవాడకు చె ందిన పెట్రోల్ బంక్ మెకానిక్ షేక్ సకికేందర్, బోయిన్‌పల్లికి చెందిన సందీప్ కూడా పాలు పంచుకున్నారు.
 
 గుట్టు రట్టు ఇలా....
 విశ్వసనీయ సమాచారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ ఓఎస్‌డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, పుష్పన్‌కుమార్, అంజయ్య, బస్వారెడ్డి, ఎస్సైలు రమేష్, శివకుమార్, మహేశ్, నాగరాజు కూకట్‌పల్లిలోని అఫ్జల్ బారీ ఇంటిపై దాడి చేశారు. నిందితులు అఫ్జల్ బారీ, షేక్ ముస్తాఫా, షేక్ సకికేందర్, కల్యాణ్, శిబులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసం కేసులో మరో ముగ్గురు నిందితులు ఫైజల్ బారీ, సందీప్, వివేక్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, 600 చిప్‌లు, 100 రిమోట్‌లు, 100 రిసీవర్లు, నాలుగు ఎడాప్టర్లు, ఒక లగ్జరీకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రకాంత్‌కు అప్పగించారు.
 
 బంకుల్లో చౌర్యం వెలుగులోకి...
 ఎస్‌వోటీ పోలీసులు శివార్లలోని 11 పెట్రోల్ బంకుల్లో బుధవారం రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో పది బంకుల్లో పెట్రోల్‌ను చౌర్యం చేస్తున్న సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్, నాగోల్, ఉప్పల్, తుక్కుకూడ, కూకట్‌పల్లి, మియాపూర్, ఆర్సీపురం, శంషాబాద్ లోని పెట్రోల్ బంకుల నుంచి చిప్ కార్డులతో పాటు రిమోట్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని తూనికలు, కొలతల శాఖ అధికారులను అప్పగించారు. ఆయా బంకులను సీజ్ చేసే అవకాశం ఉందని ఎస్‌వోటీ వర్గాలు తెలిపాయి. ఈ చోరీ సాఫ్ట్‌వేర్, చిప్‌లతో ఇతర రాష్ట్రాల్లోనూ పెట్రోల్ చౌర్యం జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
 
 రిమోట్ ఆపరేషన్...
 ముంబైలోని హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలో సర్వీస్ మెకానిక్, కేరళకు చెందిన శిబు కె.థామస్ ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించాడు. దాంతో తయారు చేసిన చిప్ 800 ఎం.ఎల్. పెట్రోల్ పోసినా ఒక లీటర్‌గానే చూపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్ విషయాల్లో పరిజ్ఞానం ఉన్న ముంబై వాసి వివేక్ ఇతనికి సహకరించాడు.
 
 సాధారణంగా ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు రూపొందించిన ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్లతోనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారుల వాహనాల్లో పోస్తుంటారు. ఆ మెషిన్లలో ఆయా కంపెనీల సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన చిప్‌లనే అమరుస్తారు.  వాటితో పాటు ఈ నకిలీ చిప్‌లనూ పెడతారు. అధికారులు తనిఖీలకు వచ్చినపుడు రిమోట్ కంట్రోల్ సాయంతో చిప్‌ను ఆఫ్ చేస్తారు
 
సాక్షి
Continue Reading | comments

Google to offer prize at hacking

Monday, January 27, 2014

Search engine giant Google will offer $2.7 million to researchers who can hack its browser-based operating system Chrome OS as part of its Pwnium hacking contest to be held in March this year. 

"Security is a core tenet of Chromium, which is why we hold regular competitions to learn from security researchers. Contests like Pwnium help us make Chromium even more secure," Google said in a blogpost. 

This year, Pwnium 4, will be hosted in March at the CanSecWest security conference in Vancouver, Canada. 

"With a total of $2.71828 million in the pot, we'll issue Pwnium rewards for eligible Chrome OS exploits at $110,000 for browser or system-level compromise in guest mode or as a logged-in user, delivered via a web page," it said. 

Google will also pay $150,000 for providing an exploit to be able to persistently compromise an HP or Acer Chromebook, ie hacking the device to retain control even after a reboot. 

The earlier editions of Pwnium competitions focussed on Intel-based Chrome OS devices, but this year Google will allow researchers to also choose from ARM-based Chromebook, the HP Chromebook 11 (Wi-Fi) and the Acer C720 Chromebook (2GB Wi-Fi) based on Intel's Haswell microarchitecture. 

Last year, Google had put $3.14159 million in the pot for Pwnium 3. 

Google said it would consider larger bonuses this year to researchers who demonstrated what it called a "particularly impressive or surprising exploit." 

"New this year, we will also consider significant bonuses for demonstrating a particularlyimpressive or surprising exploit. Potential examples include defeating kASLR, exploiting memory corruption in the 64-bit browser process or exploiting the kernel directly from a renderer process," it said.
Continue Reading | comments

సునామీ వచ్చినా షేక్ కాదు...

Sunday, January 26, 2014

సునామీ వచ్చినా షేక్ కాదు...
ఈ విషయం దీన్ని రూపొందించిన అమెరికా డిజైనర్ డాన్ నెల్సన్ చెబుతున్నారు. అందుకే ఈ ఇంటికి సునామీ హౌస్ అని పేరు పెట్టారు. అమెరికాలోని కమానో ద్వీపంలో సముద్రమట్టానికి 9 అడుగుల ఎత్తులో దీన్ని కట్టారు. పిల్లర్లకు సపోర్ట్‌గా పైన అంతా స్టీల్ ఫ్రేమ్స్ వేశారు. పిల్లర్ల మధ్య భాగమంతా అద్దాలతో నిండి ఉంటుంది. అవి.. వరద తాకగానే బద్దలైపోతాయన్నమాట. అందుకే రెండంతస్తుల భవనంలోని కింద ఫ్లోర్‌కు ఫ్లడ్ రూం అని పేరుపెట్టారు. అంటే.. సునామీ వచ్చినప్పుడు సముద్రపు నీరు ఈ కింద భాగాన్ని తాకినప్పుడు ఇటు వైపు అద్దాలు బద్దలై.. నీరు అటు వైపు నుంచి బయటకు పోతుంది. భవనానికి ఏమాత్రం నష్టం కలగదు. జనం పై భాగంలోకి  సురక్షితంగా ఉండొచ్చు. ఇది ఒక్క సునామీనే కాదు.. భూకంపాలనూ తట్టుకుంటుందట!
Continue Reading | comments

పక్కా ‘ట్రాక్’పై నిఘా

Tuesday, January 21, 2014

పక్కా ‘ట్రాక్’పై నిఘా
  •  సైబరాబాద్‌లో జీపీఎస్  ఆధారంగా పనిచేసే ‘వీటీఎస్’
  •  పోలీసు వాహనాల కదలికలపై కన్ను
  •  చాలావరకు తగ్గనున్న రెస్పాన్స్ టైమ్
  •  నాలుగింటిలో ప్రయోగాత్మకంగా అమలు
  •  త్వరలో మరో 70 వెహికల్స్‌లో ఏర్పాటు
 
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా సేవలందించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ రంగం సిద్ధం చేస్తోంది. జీఐఎస్, జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే వెహికల్ ట్రాకింగ్ సిస్టం (వీటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది. బాధితుల కాల్స్‌కు త్వరి తంగా రెస్పాన్స్ ఇచ్చేందుకు, పోలీసు గస్తీ వాహనాల కదలికలపై నిఘా ఉంచేం దుకు ఉపయోగపడే ఈ వ్యవస్థతో పలు అవస్థలు తప్పనున్నాయి. దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు వాహనాల్లో ప్రవేశపెట్టారు. ఈ నెలాఖరుకు కమిషనరేట్‌లోని 70 గస్తీ వాహనాల్లో ఏర్పాటు చేయనున్నారు.

గస్తీ వాహనాలపై నిఘా సైతం...

ఈ వ్యవస్థతో పోలీసు వాహనాల గస్తీ సైతం పక్కాగా జరిగేలా నిఘా ఉంచే అవకాశముంది.
     
{పస్తుతం ఈ వాహనాల గస్తీపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
     
తాజా ట్రాకింగ్ సిస్టం వల్ల ఏదైనా వాహనం ఎక్కడ గస్తీ నిర్వహిస్తోందన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు.
     
వాహనాన్ని ఘటనాస్థలికి పంపేటప్పుడు దాన్లో ఉన్న ఇంధనం సరి పోతుందా? లేదా? అనేదీ ముందుగానే తెలుసుకోవచ్చు.
     
ఒక్కో వాహనానికి నెలకు
ఎంత డీజిల్     కేటాయించారు, దాని మైలేజ్ ఎంత? అది ఎన్ని కి.మీ. గస్తీ తిరిగింది? ఇంకా ఎంత డీజిల్ ఉంది? తదితర విషయాలనూ ఇది విశ్లేషిస్తుంది.
 
ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ వాహనాలకూ..
 ‘రెస్పాన్స్ టైమ్ తగ్గించడంతోపాటు గస్తీ వాహనాలపై నిఘా ఉంచడానికి వీటీఎస్ ఉపకరిస్తుంది. దీన్ని మొదటి దశలో 70 పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే ఓఆర్‌ఆర్‌పై తనిఖీలు చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఐదు వెహికల్స్‌కూ ఏర్పాటు చేస్తాం. ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్‌లో తెరపై కనిపించడంతోపాటు సర్వర్‌లోనూ డంప్ అవుతుంది. దానిలోకి లాగిన్ అయిన ఏ అధికారైనా ఎక్కడి నుంచైనా ఈ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.’    - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ, సైబరాబాద్
 
 వేగంగా స్పందించడమే ప్రధాన లక్ష్యం
 ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి సాయం కోరగలరు తప్ప.. అన్ని సందర్భాల్లో వారి వివరాలు చెప్పే స్థితిలో ఉండరు.
     
 ఈ నేపథ్యంలో కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన కాల్‌ను బట్టి అది ఏ ప్రాంతం నుంచి వస్తోందనేది సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
     
 సమాచారం అందగానే ఎంత వేగంగా పోలీసులు స్పందించగలిగితే బాధితులకు అంత ఊరట లభిస్తుంది.
     
 ఈ రెస్పాన్స్ టైమ్ తగ్గించాలంటే రక్షక్, మొబైల్ వాహనాలు ఎక్కడున్నాయో వేగంగా తెలుసుకోవాలి.
     
 దీనికోసం ఆ వాహనాల్లో జీఐఎస్ (గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేస్తారు.
     
 వీటిని కంట్రోల్‌రూమ్‌లో ఉండే వీడియో వాల్‌కు అనుసంధానిస్తారు.
     
 ఫలితంగా ఓ వాహనం ఏ ప్రాంతంలో ఉందనేది స్క్రీన్‌పై గుర్తుల రూపంలో కనిపిస్తుంది.
     
 ఫోన్ వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికి వైర్‌లెస్ సెట్‌తో సమాచారమిచ్చి అటు మళ్లిస్తారు.
     
 ఈ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ కాంట్రాక్టును ఓ సంస్థ దక్కించుకుంది. ప్రయోగాత్మకంగా 4 వాహనాల్లో ఏర్పాటు చేసి సమస్యల్ని అధ్యయనం చేస్తోంది.
 
Continue Reading | comments

ఆధార్ తప్పనిసరి చేయటం కుదరదు: సుప్రీం

Monday, September 23, 2013

ఆధార్ తప్పనిసరి చేయటం కుదరదు: సుప్రీం
న్యూఢిల్లీ : ఆధార్ కార్డులు లేనివారికి సుప్రీంకోర్టు తీర్పు ఊరట కలిగించింది. పథకాలకు ఆధార్ కార్డులను లింక్ చేయటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్యాస్ కనెక్షన్ సహా ఇతర సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయటం ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా అక్రమంగా వలసలు వచ్చిన వారికి ఆధార్ కార్డులు జారీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది.

కాగా  దేశవ్యాప్తంగా పౌరులకు ఆధార్ కార్డులను అందజేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను మరో ఐదు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇంగ్లిష్, హిందీలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందించిన ఆధార్ (www.uidai.gov.in) వెబ్‌సైట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Continue Reading | comments

Sport

Entertainment

World News

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger