Home » , , » జూ. ఎన్టీఆర్ టచ్‌లోనే ఉన్నారు

జూ. ఎన్టీఆర్ టచ్‌లోనే ఉన్నారు

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో తాను ఇంకా టచ్‌లోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శానససభ్యుడు కొడాలి నాని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవచ్చునని ఆయన అన్నారు. తనకు జారీ చేసిన నోటీసుపై ఆయన గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు నందమూరి కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదనేది సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితోనో, టిడిపితోనో తగాదా పడినవారు నందమూరి కుటుంబ సభ్యులతో సంబంధాలు పెట్టుకోకూడదనేది సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ ఎన్టీ రామారావు బొమ్మలను చంద్రబాబు తప్ప ఎవరైనా వాడుకోవచ్చునని ఆయన అన్నారు.
ఎన్టీ రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అందువల్ల ఎన్టీ రామారావు బొమ్మలను వాడుకునే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వాడుకోవద్దని తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల బొమ్మలతో కలిపి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలను పెట్టడం లేదని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల్లో అలా పెడుతుంటే వద్దని కూడా తాను సూచించానని ఆయన అన్నారు.
తాను ఓ పార్టీలో ఉన్నానని, ఆ పార్టీలోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని, అందువల్ల జూనియర్ ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని తాను అనుకుంటున్నానని ఆయన అన్నారు. తన బొమ్మలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారని, చంద్రబాబుకో మరెవరికో జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయవద్దని ఆదేశించిన చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత లేదని, చంద్రబాబు తప్పుకుని ఆ స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ విజయమ్మకు ఇవ్వాలని ఆయన అన్నారు. తాను విప్ ధిక్కరించినట్లు భావిస్తే తనపై వేటు వేయాలని తాను స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. ఉప ఎన్నిక వస్తే తాను ఎదుర్కుంటానని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఏ విధమైన విప్ అందలేదని తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. జీవితాంతం తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యుపిఎకు మద్దతు ఇస్తానని చెప్పడంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.

source:oneindia
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger