Home » , » చంద్రబాబు ను కలవడానికి మోత్కుపల్లి నో

చంద్రబాబు ను కలవడానికి మోత్కుపల్లి నో


తెలుగుదేశం పార్టీకి మోత్కుపల్లి నరసింహులు చికాకుకు గురి చేసేలా ఉన్నారు. శాసనసభకు వచ్చిన ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం తెలంగాణ నేతలు ఆయనను బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు.కాని అందుకు ఆయన సమ్మతించలేదు. ఆంద్రవారికే రెండు సీట్లు ఇస్తే ప్రశ్నించలేని దౌర్యగ్య స్థితిలో తెలంగాణ టిడిపి నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు. గరికపాటి వరంగల్ జిల్లావాసి అయినా ఆంద్రవాడి కిందే మోత్కుపల్లి లెక్కేస్తున్నారా!

ఎంతో ఆశపడి,  ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ వ్యవహారం విషయంలో మోత్కుపల్లి నర్సింహులు పట్టు వీడటం లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయన ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు....మోత్కుపల్లిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు.  ఈ సందర్భంగా మోత్కుపల్లి టీ.టీడీపీ నేతలపై మం
డిపడ్డారు. రాజ్యసభ రెండు సీట్లు ఆంధ్రావాళ్లకే ఇచ్చినా... అడగలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.

కాగా తాను అనుకున్నట్లు అధినేతను ఆడించేందుకు.. తన పనులు చేయించుకునేందుకు.. ఎదుటి వర్గంపై పైచేయి సాధించేందుకు అలకబూనడం మోత్కుపల్లికి కొత్తేం కాదు, ఇది మొదటిసారి కూడా కాదని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు.  గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి నేతత్వంలో బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు.   గతంలో ఓ మారు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తిరిగి, టీడీపీకి గూటికి చేరారు. ‘.. ఏమో, ఏమైనా జరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్టీ అధినేత ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది.

sakshi
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger