సాయి శిరీష నాటకీయ ఫక్కిలో సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు. సవతి తండ్రి నీల ప్రసాద్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని శిరీష ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో వెల్లడించడం సంచలనం రేపింది. లవ్ ఎటాక్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హర్షిత అదృశ్యమైనట్టు సవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. మే 27న షూటింగ్ కు వెళ్లిన తమ అమ్మాయి జాడ తెలియడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే అదృష్యమైన శిరీష నాటకీయ ఫక్కిలో సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు.
నీల ప్రసాద్ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం తప్పుదారి పట్టించే విధంగా ఉండటంతో పోలీసుల్లో పలు సందేహాలు తలెత్తాయి. నీల ప్రసాద్ వ్యవహారశైలిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

0 comments:
Post a Comment