Home » , , , » ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి

ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి

ఆగస్టు 15న రాంగోపాల్ వర్మ కుమార్తె పెళ్లి

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి పెళ్లి దేశ స్వాతంత్ర్య దినోత్సవం.. అంటే ఈనెల 15వ తేదీన జరగనుంది. ప్రణవ్ అనే వైద్యునితో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. బాగా సన్నిహిత మిత్రులు, కొత్త దంపతుల బంధువులను మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాంగోపాల్ వర్మ కుమార్తె రేవతి కూడా మెడిసిన్ చదువుతున్నారు. ప్రణవ్ తో ఆమె ప్రేమలో పడగా, ఇద్దరి పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఈ సంవత్సరం జనవరిలో వాళ్ల వివాహ నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖుల ఇళ్లలో పెళ్లిలా ఇది భారీగా ఉండబోదని, బాగా సన్నిహితులను, కుటుంబ సభ్యులను మాత్రమే పిలిచి నిరాడంబరంగా పెళ్లి చేయాలనుకుంటున్నారని రాంగోపాల్ వర్మ కుటుంబానికి సన్నిహత వర్గాలు తెలిపాయి. తెలుగు సినీ పరిశ్రమలో వర్మకు బాగా సన్నిహితులను కూడా పిలవనున్నారు. ఇక ఇతర సెలబ్రిటీలెవరూ ఈ పెళ్లిలో కనపడకపోవచ్చని సమాచారం.

పెళ్లికి ముందు రేవతి - ప్రణవ్ తమ స్నేహితుల కోసం ఓ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారని, అందులో దంపతుల సన్నిహిత మిత్రులు మాత్రమే ఉంటారు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వారెవ్వరూ ఉండబోరని వర్మ కుటుంబ సన్నిహితులు తెలిపారు. పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు సంతోషంగా అంగీకరించారని తెలిసింది. ప్రణవ్ తల్లిదండ్రులు కూడా వైద్యులేనని, వారు దుబాయ్ లో స్థిరపడ్డారని సమాచారం.

courtesy:sakshi
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger