Home » , , » వారి తప్పు లేదంటే జగన్‌పై కేసే ఉండదు...

వారి తప్పు లేదంటే జగన్‌పై కేసే ఉండదు...

ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్, మోతీలాల్‌వోరా, దిగ్విజయ్‌సింగ్ వంటి అగ్ర నేతలను కలవటంతో పాటు.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌తో సీఎం ఏకంగా ఐదుసార్లు భేటీ అయ్యారు. అభియోగాలు నమోదైన మంత్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల వ్యవహారంపై సుదీర్ఘంగా సాగిన చర్చల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 

ఈ కేసుల్లో మంత్రులు ఎలాంటి తప్పూ చేయలేదని, వారిని తప్పించాల్సిన అవసరం కూడా లేదని, తప్పించటం వల్ల కాంగ్రెస్‌కే నష్టమన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ.. మంత్రులది తప్పు లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పైన కూడా కేసు లేనట్లేనని.. ఆ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించినట్లవుతుందని, జగన్‌ను దృష్టిలో పెట్టుకుని మంత్రుల వ్యవహారంపై నిర్ణయానికి రావాలన్న చర్చ ఢిల్లీలో జరిగినట్లు చెప్తున్నారు. ఆ కారణంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో అటు అధిష్టానం పెద్దలు కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శనివారం హైదరాబాద్ తిరిగి వచ్చిన సీఎం కిరణ్.. వెంటనే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని.. ఈ అంశంపైనే చర్చలు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

sakshi
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger